తెలంగాణ

telangana

రిషబ్ శెట్టి 'కాంతార-2' సీక్వెల్​ రానుందా?.. ఇదిగో క్లారిటీ!

By

Published : Oct 16, 2022, 10:33 AM IST

Kantara Movie : సాధారణ సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది 'కాంతార' మూవీ. ఈ సినిమాకు సీక్వెల్​ తీయడం గురించి నటుడు రిషబ్​ శెట్టి స్పందించారు. ఇంతకీ ఏమన్నారంటే..

rishab shetty comments on kantara sequel
rishab shetty comments on kantara sequel

Kantara Sequel: 'కాంతార'తో సూపర్‌హిట్‌ అందుకున్నారు కన్నడ నటుడు రిషబ్‌ శెట్టి. ప్రకృతి నేపథ్యంలో సిద్ధమైన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సాధారణ చిత్రంగా విడుదలై కన్నడ బాక్సాఫీస్‌ వద్ద విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే 'కాంతార' చిత్రాన్ని హిందీ, తెలుగులోనూ చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో భాగంగా ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు రిషబ్‌ శెట్టి ఇంటర్వ్యూ ఇచ్చారు. 'కాంతార-2'పై విలేకరి ప్రశ్నించగా.. 'నో కామెంట్స్‌' అని బదులిచ్చారు.

"'కాంతార -2' గురించి ప్రస్తుతానికి ఏం చెప్పలేను. ఎందుకంటే ప్రస్తుతం 'కాంతార' సమయం నడుస్తోంది. ఇది ప్రకృతికి సంబంధించిన కథ కాబట్టి దీనిలో ఉపకథలను చూపించడానికి అవకాశం ఉంది. రక్షిత్‌ శెట్టితో నేను తెరకెక్కించిన 'కిర్రాక్‌పార్టీ'కి త్వరలో సీక్వెల్‌ చేస్తా. కొత్త కథతో దీన్ని రూపొందిస్తున్నా" అని రిషబ్‌ తెలిపారు. అనంతరం ఆయన తెలుగు ఇండస్ట్రీకి చెందిన హీరోలందరిపై తనకి అభిమానం ఉందని, ఎన్టీఆర్‌ అంటే ప్రత్యేకమైన ఇష్టమని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details