తెలంగాణ

telangana

పాన్‌ ఇండియా సినిమాలపై కమల్​ ఆసక్తికర కామెంట్స్​

By

Published : May 27, 2022, 9:06 AM IST

పాన్‌ ఇండియా సినిమాలపై లోక నాయకుడు కమల్‌హాసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాన్‌ ఇండియా చిత్రాలు ఇప్పటికిప్పుడు వచ్చినవి కావు అన్నారు.

Kamal Haasan
కమల్

''పాన్‌ ఇండియా చిత్రాలన్నవి ఇప్పుడు కొత్తగా వచ్చినవేమీ కాదు. ఇండస్ట్రీ ఆరంభం నుంచి ఉన్నాయి'' అన్నారు కథానాయకుడు కమల్‌హాసన్‌. ఇప్పుడాయన నుంచి వస్తున్న యాక్షన్‌ చిత్రం 'విక్రమ్‌'. లోకేష్‌ కనగరాజ్‌ తెరకెక్కించారు. విజయ్‌ సేతుపతి, ఫహాద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు కమల్‌. ఇందులో భాగంగా తాజాగా ఓ జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పాన్‌ ఇండియా సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''పాన్‌ ఇండియా అనే పదం ఓ కొత్త నాణెం లాంటిదే తప్ప మరొకటి కాదు.

ఎందుకంటే పాన్‌ ఇండియా చిత్రాలు మన భారతీయ చిత్రసీమలో ఎల్లప్పుడూ ఉన్నాయి. 'మొఘల్‌-ఎ-ఆజం', 'చెమ్మీన్‌' వంటి క్లాసిక్‌ చిత్రాలు ఇందుకు మంచి ఉదాహరణ. శాంతారామ్‌, మొహమూద్‌ వంటి వారు ఎన్నో పాన్‌ ఇండియా సినిమాలు తీశారు. 'చెమ్మీన్‌' అనేది మలయాళ సినిమా. వాళ్లు దాన్ని ఇతర భాషల్లోకి డబ్‌ చేయలేదు. దానికి సబ్‌ టైటిల్స్‌ కూడా లేవు. కానీ, ప్రజలు దాన్ని భాషలు, ప్రాంతాలకు అతీతంగా ఆస్వాదించారు. సార్వత్రిక ఆకర్షణ, చిత్ర నిర్మాణ నాణ్యత.. ఇవే ఈ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ల విజయానికి మూల కారణాలు. మన దేశం అద్వితీయం. అమెరికాలా కాకుండా వివిధ భాషలు మాట్లాడినా మనమంతా ఒక్కటే. అదే ఈ దేశానికి అందం'' అని కమల్‌ వివరించారు. ఇక 'విక్రమ్‌' గురించి మాట్లాడుతూ.. ఇదొక బాధ్యతాయుతమైన చిత్రమన్నారు.

ఇదీ చదవండి:రామ్​చరణ్- శంకర్ సినిమా టైటిల్​ అదేనా?

TAGGED:

Kamal Hassan

ABOUT THE AUTHOR

...view details