తెలంగాణ

telangana

'జవాన్'​ సర్​ప్రైజ్​.. షారుక్​-దీపిక యాక్షన్​ గూస్​బంప్స్​.. ఇది ఆరంభం మాత్రమే

By

Published : Jul 10, 2023, 11:04 AM IST

Updated : Jul 10, 2023, 11:48 AM IST

Jawaan prevue : తమిళ దర్శకుడు అట్లీ.. బాలీవుడ్ బాద్​ షా షారుక్ కాంబోలో తెరకెక్కిన 'జవాన్' సినిమా ప్రివ్యూ వీడియో రిలీజై ఆకట్టుకుంటోంది. ఈ ప్రచార చిత్రం చూస్తంటే గూస్​ బంప్స్​ వస్తున్నాయి. మీరు చూసేయండి..

Jawaan prevue
Jawaan prevue

Jawaan prevue : అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలీవుడ్ బాద్​ షా షారుక్ 'జవాన్' నుంచి అదిరిపోయే అప్డేట్​ బయటకు వచ్చింది. ప్రివ్యూ పేరుతో 2:12 నిమిషాల నిడివి గల వీడియోను రిలీజ్​ చేసింది మూవీటీమ్​. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం... అదిరిపోయే డైలాగ్​లు, యాక్షన్ సన్నివేశాలతో, కళ్లు చెదిరే విజువల్స్​తో అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.

ఈ ప్రచార చిత్రంలో అట్లీ మార్క్‌ యాక్షన్​ బాగా కనపడింది. తల్లికిచ్చిన మాట. నేరవేరని లక్ష్యం. ఈ రెండింటి కారణంగా ఓ మంచి వ్యక్తి చెడ్డవాడిలా ఎందుకు మారాడు? లేదంటే మారినట్టు నటిస్తున్నాడా? అనే పలు ప్రశ్నలతో ఈ ప్రచార చిత్రం ఆకట్టుకుంది. 'ఎవరు నేను. ఎవరినీ కాను. తెలియదు. తల్లికి ఇచ్చిన మాట కావచ్చు. నెరవేరని లక్ష్యం కావచ్చు. నేను మంచివాడినా, చెడ్డవాడినా, పుణ్యాత్ముడినా, పాపత్ముడినా, నీకు నువ్వు తెలుసుకో. ఎందుకంటే నేనే నువ్వు. రెడీ... పేరు తెలుసుకో' అంటూ షారుక్ స్టైలిష్ లుక్, ఆయనకు ఇచ్చిన ఎలివేషన్​​ అదిరిపోయింది. ​ఓ వైపు పోలీస్​ ఆఫీసర్​గా, మరోవైపు జవాన్​గానూ షారుక్​ ఆకట్టుకున్నారు. అలాగే ముఖానికి ముసుగు వేసుకుని, పవర్​ఫుల్​​ మాస్​ అవతార్​లోనూ అదిరిపోయారు. ఇక చివర్లో​ గుండు గెటప్​లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. సీరియస్​గా ఉంటూనే ఫన్నీగా డ్యాన్స్​ చేస్తూ కామెడీ చేశారు. అలానే​ 'ఇది ఆరంభం మాత్రమే', 'నేను విలన్​ అయితే ఏ హీరో నా ముందు నిలబడలేదు' అంటూ షారుక్ డైలాగ్​లు హైలైట్​గా నిలిచాయి.

jawaan cast and crew : ఇక హీరోయిన్​గా నయనతార స్టైలిష్​ లుక్​, మధ్యలో దీపికా పదుకొణె ఫైటింగ్ సీక్వెన్స్​ కూడా అదిరిపోయాయి. విజయ్ సేతుపతి క్యారెక్టర్‌, లుక్​ను అంతగా రివీల్ చేయలేదు. అయితే ఆయన పాత్ర మాత్రం అదిరిపోతుందని టాక్ వినిపిస్తోంది. బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​ కూడా సీన్​కు తగ్గట్టు ఎలివేషన్​ ఇస్తూ హైలైట్​గా నిలిచింది. ఇక ఈ ప్రచార చిత్రం చూసిన అభిమానులు.. షారుక్​కు మరో బ్లాక్ బాస్టర్​ హిట్​ ఖాయమని ఫిక్స్​ అయిపోయారు.

jawaan theatrical rights : ఇక రీసెంట్​గా ఈ సినిమా నాన్‌ థియేట్రికల్‌ రైట్స్​ రూ.250 కోట్లకు కొనుగోలు చేశారని వార్తలు వచ్చాయి. పైగా' పఠాన్' వంటి బ్లాక్ బాస్టర్​ ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడం వల్ల.. జవాన్​పై భారీ హైప్​ నెలకొంది. ఈ చిత్రాన్ని రెడ్‌ చిల్లీ ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. షారుక్​ భార్య గౌరీ ఖాన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇదీ చూడండి :

షూటింగ్​లో షారుక్​కు ప్రమాదం.. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారంటే?

వామ్మో.. సల్మాన్​, షారుక్​ బాడీగార్డుల​ శాలరీ అంతా?.. భారీగానే ఇస్తున్నారుగా!

Last Updated : Jul 10, 2023, 11:48 AM IST

ABOUT THE AUTHOR

...view details