తెలంగాణ

telangana

'చిరు క్షమిస్తే.. పవన్ వడ్డీతో తిరిగిచ్చేస్తాడు.. మెగా ఫ్యామిలీని ఎవడైనా అంటే కుర్చీ మడతపెట్టి..'

By

Published : Aug 6, 2023, 10:51 PM IST

Bhola shankar pre release event : మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్​లో కమెడియన్ హైపర్​ ఆది మాట్లాడిన కామెంట్స్​ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆయన ఏం మాట్లాడాడంటే?

Hyper adi
'చిరు క్షమిస్తే.. పవన్ వడ్డీతో తిరిగిచ్చేస్తాడు.. మెగా ఫ్యామిలీని ఎవడైనా అంటే కుర్చీ మడతపెట్టి..'

Bhola shankar pre release event : మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్​లో కమెడియన్ హైపర్​ ఆది మాట్లాడిన కామెంట్స్​ సోషల్ మీడియాలో పుల్ వైరల్ అవుతున్నాయి.

Hyper aadi comments Bhola shankar pre release event : హైపర్ ఆది మాట్లాడుతూ... "ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఒక యువకుడు నేను సైనికుడిని అవుతా అని చెప్పి యుద్ధ భూమికి బయలుదేరాడు. ఆ యుద్ధ భూమిలో కండలు తిరిగిన సైనికులు చాలా మంది ఉన్నారు. వాళ్లు యుద్ధం చేస్తున్నారు. గెలుస్తున్నారు. అది ఆయన చూస్తున్నాడు. ఒక రోజు ఈయనకు యుద్ధం చేసే అవకాశం వచ్చింది. గెలిచాడు. అందరూ కలిసి అతడిని సైన్యాధిపతిగా ఎంచుకున్నాడు. దీంతో అతడు ఒక ముప్పై ఏళ్లు యుద్ధభూమిని ఏలాడు. ఆయన ఎవరో కాదు... మెగాస్టార్ చిరంజీవి. అన్నయ్య ఇంత మంది సినీ సైనికులను తయారు చేసి... ఇంద్రాసేనాని అయితే... తమ్ముడేమో.. జనసైనికుల్ని తయారు చేసి జనసేనాని అయ్యారు. బేసిక్​గా హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు.. కానీ ఆయనకు హీరోలే ఫ్యాన్స్ గా ఉంటారు. ఆస్తులు సంపాదించడం కన్నా... అభిమానులను సంపాదించారు. అటు కొత్త తరం వారికి పాత తరం వారికి మధ్యలో వారధి. ప్రతి ఇంట్లో ఫ్యాన్ ఉంటదో లేదో చెప్పలేం కానీ... ప్రతి ఇంట్లో మెగాస్టార్ ఫ్యాన్ అయితే కచ్చితంగా ఉంటారు" అని అన్నారు.

Hyper aadi comments on chiranjeevi : సచిన్-చిరంజీవి ఒక్కటే.. నా దృష్టిలో మెగాస్టార్ చిరంజీవి, సచిన్ తెందుల్కర్​ ఒకటే. సచిన్ తెందుల్కర్​ ఎవరైనా విమర్శిస్తే.. బ్యాట్ తో సమాధానం చెబుతారు. అలాగే మెగాస్టార్ చిరంజీవిని ఎవరినైనా విమర్శిస్తే.. ఆయన సినిమాతో సమాధానం చెబుతారు అని హైపర్ ఆది చెప్పారు. ఆచార్య సినిమాతో విమర్శలు వచ్చాయి.. వాల్తేరు వీరయ్యతో సమాధానం చెప్పారు. డ్యాన్స్, ఫైట్స్​లో మార్క్ సెట్ చేసింది మెగాస్టార్ చిరంజీవినే. అప్పట్లో మొదటి సారి కోటి రూపాయలకు పైగా ఇండియన్ యాక్టర్ ఎవరంటే.. మెగాస్టార్ చిరంజీవి. మొదటి రూ. 10 కోట్లు కలెక్ట్ చేసిన చిత్రం ఘరానా మొగుడు అని ఎక్కడ వెతికినా వస్తది. ఇక్కడ ఉన్న చాలా మందికి ఊహ తెలియక ముందే ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేశారు. ఆయన ఎదగక ముందు అవమానాలు జరిగాయి. ఎదిగిన తర్వాత కూడా అవమానాలు ఎదురయ్యాయి. ఆయన ఎప్పుడూ ఎవ్వరినీ ఏం అనలేదు. ఠాగూర్ సినిమాలో ఆయనకు నచ్చని ఓకే ఒక్క పదం క్షమించడం.. కానీ ఆయన నిజ జీవితంలో ఆయనకు నచ్చిన పదం క్షమించడం అని హైపర్ ఆది అన్నారు.

Hyper aadi comments viral : గుండు కొట్టేసేవారు.. ఒకప్పుడు చిరు రాజకీయ ప్రచారం చేసే సమయంలో ఎవరో గుడ్డు కొట్టాడు. ఒక్కసారి ఆయన కన్నేర్ర చేసి ఉంటే.. అక్కడే వాడికి గుండు కొట్టేవారు. ఒకప్పుడు మినిస్టర్ హోదాలో ఆయన ఓటు హక్కు గురించి లైన్ క్రాస్ చేస్తే... ఓ ఎన్​ఆర్​ఐ లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడాడు. చూసిన మనకందరికీ కోపం వచ్చింది. చిరంజీవికి కోపం రాలేదు. కొన్ని వేల మందికి ప్రవచనాలు చెప్పే ఓ వ్యక్తి.. కొన్ని కోట్ల మంది అభిమానించే మెగాస్టార్ చిరంజీవి మీద అసహనం వ్యక్తం చేశారు. అది కూడా చిరంజీవికి సంబంధం లేకుండా. ఆరోజూ కూడా చిరంజీవి సహనం కోల్పోలేదు. ఆ రోజు వెళ్లి ఆయన పక్కకు వెళ్లి కూర్చున్నారు. అని హైపర్ ఆది అన్నారు.

కష్టపడి సంపాదించుకోండి... కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఉంటాయి. వారందరూ హీరో ఉదయ్, హీరో సుమన్ విషయాల మీద తప్పుడు వార్తలు రాసి... ఫేమ్​ సంపాదించుకనేందుకు ప్రయత్నాలు చేస్తుంటాయి. అలాంటి వారికి నేను చెప్పేది ఒక్కటే.. కష్టపడి సంపాదించుకోండి ఇలాకాదు. టాలీవుడ్​లో ఓ దర్శకుడు ఉన్నాడు. ఆయన్ను అనే స్థాయి నాకు లేదు. ఆయన చిన్న పెగ్ వేసినప్పుడు మెగాస్టార్​ను.. పెద్ద పెగ్ వేసినప్పుడు పవర్ స్టార్ ను విమర్శిస్తుంటారు. వాళ్లకి చెబుతున్నాను.. అర్థం లేని మాటలకు క్లాప్స్ రావు.. అర్థం లేని సినిమాలకు కలెక్షన్స్ రావు.. నాకు తెలిసి మీ వ్యూహాలు బెడిసి కొడతాయని అనుకుంటున్నాను. అలాగే ఏ ప్రభుత్వాలైతే చిరు బ్లడ్ బ్యాంకులకు అవార్డులు ఇచ్చాయో ప్రభుత్వాలు... రాజకీయాల్లోకి వచ్చినప్పుడు బ్లడ్ బ్యాంక్ గురించి తప్పుడు ప్రచారాలు చేశారు. అయినా చిరంజీవి క్షమించారు. అన్ని అన్నారు.

ఎంతో మంది హీరోలను తట్టుకుని.. చిరంజీవి వారసుడు రామ్ చరణ్ చిరుత చిత్రంతో వచ్చినప్పుడు కావాలని ఏన్నో కామెంట్స్ చేశారు. సినిమా హిట్ అయితే డైరెక్టర్ వల్ల.. ఫ్లాప్ అయితే రామ్ చరణ్ వల్ల అంటూ కామెంట్స్ చేశారు. ఇక అప్పుడు రంగస్థలంతో నోరెత్తిన ప్రతి ఒక్కడు చేయి ఎత్తి జై కొట్టారు. కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరు కామ్​గా ఉండిపోయారు. సచిన్ తెందుల్కర్​ కొడుకు సచిన్ అవ్వలేదు.. అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ అవ్వలేదు.. కానీ చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యారు అని హైపర్ ఆది తెలిపారు. రామ్​చరణ్​కు గ్లోబర్ స్టార్ పెట్టుకుంటే వచ్చిన పేరు కాదు... ఇక్కడ ఉన్న హీరోలను తట్టుకుని వాళ్లందరినీ నెట్టుకుని, చిరంజీవి గారి పేరు నిలబెట్టుకుని.. ఎంత ఎదిగినా చేతులు కట్టుకుని రామ్ చరణ్ ఒదిగి ఉంటారు. అని హైపర్ ఆది అన్నారు.

తమ్ముడు మొండోడు.. లేక్కలు తేల్చేస్తాడు.. కొంత మంది ఉంటారు. అన్నయ్యను పోగిడి.. తమ్ముడిని తిట్టేస్తుంటారు. తమ్ముడిని తిట్టి.. అన్నయ్యను తిడితే.. ఆయన సంతోషపడేవారా.. నేను ఓ సారి భోళా శంకర్ సెట్​లో అన్నయ్యతో మాట్లాడుతూ ఉంటే.. పాలిటిక్స్ గురించి వచ్చింది. నేను పాలిటిక్స్ చూడటం లేదు అన్నారు . ఎందుకు అన్నయ్య అంటే.. నా తమ్ముడిని తిడుతుంటే.. నేను సహించలేకపోతున్నాను అన్నారు. చిరంజీవి తనను అవమానించిన వాళ్లను వదిలేస్తారేమో కానీ.. తమ్ముడు మాత్రం వారిని గుర్తు పెట్టుకుని వడ్డీతో సహా రిటర్న్ ఇచ్చేస్తారు. చిరంజీవి గారు అభిమానులను ప్రేమిస్తారు.. శత్రువులను క్షమిస్తారు. నాగేంద్ర బాబు.. అన్నదమ్ముల కోసం అడ్డంగా నిలబడతారు. పవన్ కల్యాణ్ అందరి లెక్క తేలుస్తాడు.. అనుకున్నది సాధిస్తాడు. అన్నయ్య మంచోడు కాబట్టి.. ముంచేశారు.. తమ్ముడు మొండోడు.. తాడో పేడో తేల్చేస్తాడు" అని హైపర్ ఆది పేర్కొన్నారు.

Rage of bhola : మాస్​ మొగుడొచ్చాడు.. మెగా ర్యాప్ ఆంథమ్​ సాంగ్ చూశారా?

'గ్యాంగ్​స్టర్​+ శంకర్​దాదా= 'భోళాజీ'​.. ఫుల్​ యంగ్​గా చిరు.. సినిమాకు అదే హైలెట్​'

ABOUT THE AUTHOR

...view details