తెలంగాణ

telangana

బింబిసార మూవీ చూసిన బాలయ్య

By

Published : Aug 13, 2022, 5:47 PM IST

కల్యాణ్​రామ్​ హీరోగా తెరకెక్కిన బింబిసార చిత్రాన్ని నటుడు నందమూరి బాలకృష్ణ వీక్షించారు. బింబిసార టీమ్​తో కలిసి థియేటర్​లో మూవీ చూసిన ఆయన.. అద్భుతమైన ప్రయత్నమంటూ ప్రశంసించారు.

hero balakrishna watched bimbisara movie in theatre
hero balakrishna watched bimbisara movie in theatre

Bimbisara Movie Balakrishna: జయాప‌జ‌యాల‌ను ప‌ట్టించుకోకుండా కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలిస్తూ సినీ కెరీర్‌ను వైవిధ్య‌భ‌రితంగా ముందుకు తీసుకెళ్తున్నారు నందమూరి హీరో క‌ల్యాణ్ రామ్‌. ఈ క్ర‌మంలోనే ఇటీవల 'బింబిసార'గా ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించారు. టైమ్ ట్రావెల్ నేప‌థ్యంలో తెరకెక్కిన ఈ సోషియో ఫాంట‌సీ చిత్రం.. గత శుక్రవారం(ఆగస్టు 5) విడుదలై హిట్​టాక్​తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో హీరో నందమూరి బాలకృష్ణ.. బింబిసార చిత్రాన్ని శనివారం థియేటర్​లో వీక్షించారు. హీరో కల్యాణ్​రామ్​, దర్శకుడు వశిష్ఠ తదితరులతో కలిసి ఆయన సినిమా చూశారు. అనంతరం బింబిసార చిత్రబృందాన్ని అభినందించారు. అద్భుతమైన ప్రయత్నమంటూ ప్రశంసించారు.

హీరో బాలకృష్ణ
బాలయ్య, కల్యాణ్​రామ్​
బింబిసార టీమ్

ఇక బాలయ్య ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్​టైనర్​ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఈ చిత్రంలో బాలకృష్ణను ఢీకొట్టే విలన్ పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. లేడీ పవర్​ ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్‌ కనిపించనున్నారు. బాలయ్య సరసన శ్రుతిహాసన్​ హీరోయిన్​గా నటిస్తుండగా.. తమన్​ బాణీలు అందిస్తున్నారు. మరోవైపు, బాలకృష్ణ నటించనున్న 108వ సినిమాకు అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించనున్నారు. హైఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రం గురించి తాజాగా తొలి అప్డేట్ ఇచ్చారు మేకర్స్​.​ ఓ స్పెషల్ గ్లింప్స్​ను రిలీజ్​ చేస్తూ సినిమాను అధికారికంగా ప్రకటించారు

ABOUT THE AUTHOR

...view details