ETV Bharat / entertainment

ప్రభాస్​ స‌లార్ అప్డేట్​ మ‌రో రెండు రోజుల్లో

author img

By

Published : Aug 13, 2022, 4:16 PM IST

కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న యాక్షన్‌ మూవీ సలార్. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్​ను మేకర్స్​ మరో రెండు రోజుల్లో ఇవ్వనున్నారు.

salaar movie update on august 15
salaar movie update on august 15

Prabhas Salaar Update: 'కేజీఎఫ్'​ డైరెక్టర్​ ప్రశాంత్​ నీల్​- రెబల్​స్టార్​ ప్రభాస్​ కాంబినేషన్​లో వస్తున్న 'సలార్'​ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న డార్లింగ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాను ప్రకటించి.. చాలా కాలం అయినా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్​ రాలేదు. ఈ విష‌యంలో డార్లింగ్ అభిమానులు మేక‌ర్స్‌పై తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే తాజాగా సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్​ను మేకర్స్​ ప్ర‌క‌టించారు.

salaar movie update on august 15
ప్రభాస్​ సలార్​ అప్డేట్​

ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్​ను ఆగ‌స్టు 15 మ‌ధ్యాహ్నం 12.58 నిమిషాల‌కు ప్ర‌క‌టించిన్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు. అయితే 'సలార్​' విడుద‌ల తేదీ ప్రకటిస్తారని తెలుస్తోంది. యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్‌కు జోడీగా శ్రుతిహాస‌న్ న‌టిస్తున్నారు. హోంబ‌లే సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రెండు పాత్ర‌ల్లో న‌టించ‌నున్న‌ట్లు టాక్.

ప్ర‌భాస్ న‌టించిన 'ఆదిపురుష్' వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానుంది. మైథ‌లాజిక‌ల్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని 'త‌న్హాజీ' ఫేమ్​ ఓం రౌత్ తెర‌కెక్కించారు. దీనితో పాటు నాగ్ అశ్విన్‌తో ప్రభాస్​ 'ప్రాజెక్ట్- కె' సినిమా చేస్తున్నారు​. డార్లింగ్​ త‌న 25వ సినిమాను సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్నారు.

ఇవీ చదవండి: షారుక్​ ఖాన్​ సూపర్‌హిట్‌ను గుర్తు చేసిన లైగర్‌ జోడీ

సినిమా మధ్యలోనే ప్రేక్షకులు బయటకొచ్చారంటూ చైతూ ఆవేదన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.