తెలంగాణ

telangana

'లైగర్​' బ్యూటీపై ఆర్యన్​ ఖాన్​కు అంత కోపమా?

By

Published : Oct 7, 2022, 7:29 AM IST

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ తాజాగా ఓ సినిమా స్పెషల్‌ స్క్రీనింగ్‌కు హాజరయ్యారు. ఆయన స్క్రీనింగ్‌కు హాజరైన సమయంలో అనన్య పాండే అక్కడే ఉన్నారు. అయితే ఆయన అనన్యను ఏ మాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయారు. అందుకు సంబంధించిన వీడియోను చూసేయండి.

did-aryan-khan-just-ignore-ananya-panday-at-a-screening
did-aryan-khan-just-ignore-ananya-panday-at-a-screening

పబ్లిక్‌లో చాలా అరుదుగా కనిపిస్తుంటారు బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌. తాజాగా ఆయన ఓ బాలీవుడ్‌ సినిమా స్పెషల్‌ స్క్రీనింగ్‌కు హాజరయ్యారు. బీటౌన్‌ నటీనటులతో కలిసి సినిమాని ఎంజాయ్‌ చేశారు. అయితే అదే సమయంలో అక్కడే ఉన్న నటి అనన్యపాండేను ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

నటి మాధురీదీక్షిత్‌ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం 'మజా మా'. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా అక్టోబర్‌ 6 నుంచి ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం బీటౌన్‌ సెలబ్రిటీల కోసం ముంబయిలోని ఓ మాల్‌లో 'మజా మా' స్పెషల్‌ స్క్రీనింగ్‌ వేశారు. ఈ కార్యక్రమానికి నటి అనన్య పాండే, ఆర్యన్‌ఖాన్‌, కరణ్‌ జోహార్‌, మనీశ్‌ మల్హోత్ర హాజరయ్యారు. స్క్రీనింగ్‌కు వెళ్లే ముందు థియేటర్‌ బయట అనన్యను చూసిన ఆర్యన్‌.. ఆమెను ఏ మాత్రం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన కొంతమంది నెటిజన్లు.. "అయ్యో పాపం అనన్య ఫీలై ఉంటుంది" అంటూ సరదా కామెంట్స్‌ పెడుతున్నారు.

మరోవైపు, షారుఖ్‌ కుమార్తె సుహానా ఖాన్‌కు అనన్య మంచి స్నేహితురాలు. షారుఖ్‌ నివాసంలో జరిగే ప్రతి కార్యక్రమానికి అనన్య హాజరవుతుంటారు. ఇటీవల 'కాఫీ విత్‌ కరణ్‌' షోలోనూ అనన్య ఈ విషయాన్ని బయటపెట్టారు. అలాగే, తనకు ఆర్యన్‌ అంటే ఇష్టమనీ చెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా వచ్చిన వీడియో చూసి పలువురు నెటిజన్లు.. ఆర్యన్‌ కావాలనే ఆమెను పట్టించుకోకుండా వెళ్లిపోయారనుకుంటున్నారు.

ఇవీ చదవండి:'ఆ స్టూడియోలో రికార్డ్‌ చేసిన తొలి ఇండియన్​ మూవీ 'గాడ్​ఫాదర్'​.. ఛాన్స్​ అందరికీ ఇవ్వరు!'

60 థియేటర్లలో 'ఆదిపురుష్​' త్రీడీ టీజర్.. ట్రోల్స్​కు దిల్​రాజు స్ట్రాంగ్ కౌంటర్

ABOUT THE AUTHOR

...view details