తెలంగాణ

telangana

Atlee Rajinikanth : రజనీ డూప్​గా రోబోలా కనిపించింది అట్లీనా?.. ఆయన కెరీర్​ ఎలా మొదలైందంటే?

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2023, 10:08 AM IST

Atlee Rajinikanth Movie : జవాన్​తో పాన్​ ఇండియా లెవల్​లో సూపర్ సకెస్స్​ అందుకున్న దర్శకుడు అట్లీ.. సూపర్ స్టార్ రజనీకాంత్​కు డూప్​గా నటించారని తెలుసా? అసలు ఆయన కెరీర్​ రజనీకాంత్​ సినిమాతోనే మొదలైందని తెలుసా? ఆ వివరాలు..

Atlee Rajinikanth : రజనీ డూప్​గా రోబోలా కనిపించింది అట్లీనా?.. ఆయన కెరీర్​ ఎలా మొదలైందంటే?
Atlee Rajinikanth : రజనీ డూప్​గా రోబోలా కనిపించింది అట్లీనా?.. ఆయన కెరీర్​ ఎలా మొదలైందంటే?

Atlee Rajinikanth Movie : షారుక్​ ఖాన్​ 'జవాన్'​తో మరో భారీ బ్లాక్​ బస్టర్​ హిట్​ను తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో బాద్​ షాకు హిట్​ అందించిన దర్శకుడు అట్లీపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు ఆయన తీసిన చిత్రాలన్నీ సూపర్ హిట్టే కావడం విశేషం. అయితే ఆయన కెరీర్​ ఎలా ప్రారంభమైందో తెలుసా? ఆయన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రోబో సినిమాలో సూపర్​ స్టార్ రజనీకాంత్​ డూప్​గా నటించారని తెలుసా? ఈ చిత్రంతోనే ఆయన కెరీర్​ ప్రారంభమైందని తెలుసా? అవును మీరు చదివింది నిజమే. ఆ విశేషాలను తెలుసుకుందాం..

షార్ట్​ ఫిల్మ్​తో శంకర్​ దగ్గర.. అట్లీది మదురై. చెన్నైలో స్థిరపడ్డారు. తండ్రి ఓ ప్రైవేటు ఉద్యోగి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అట్లీ.. పదో తరగతి, ఇంటర్‌లో మంచి మార్కులు సాధించారు. అయితే ఆయనలో మంచి డాన్సర్‌ కూడా ఉన్నారు. అందుకే సినిమాల్లో వెళ్లాలనుకున్నారు. దీంతో సత్యభామ వర్సిటీలో బీఎస్సీ విజువల్‌ కమ్యూనికేషన్‌లో జాయిన్ అయ్యారు. అప్పుడే డైరెక్షన్​ వైపు వెళ్లారు. కాలేజీ ప్రాజెక్టులో భాగంగా - తన అమ్మకు ఉన్న ఏకైక గోల్డ్ చెయిన్​ను అమ్మి.. ఓ షార్ట్‌ఫిల్మ్‌ తీశారు. అప్పుడే తన అరుణ్‌ కుమార్‌ పేరును అట్లీగా మార్చాకున్నారు. ఆ షార్ట్‌ఫిల్మ్‌ నేషనల్ కాంపీటిషన్స్​ పోటీల్లో నెగ్గింది. దీంతో ఆయన శంకర్‌ దగ్గర అసిస్టెంట్​గా​ చేరారు.

రజనీకాంత్​కు డూప్​గా... రోబో చిత్రీకరణ సమయంలో రజినీకాంత్‌, ఐశ్వర్య రాయ్​తో పాటు మరో 300 మంది ఆర్టిస్టులు ఉన్నారు. అయితే దర్శకుడు శంకర్..​ విలన్​ రజనీకాంత్​కు సీన్​ను మరింత బాగా అర్థంచేసుకునేలా చెప్పడానికి.. అట్లీని పిలిచి యాక్ట్ చేసి చూపించమన్నారు. అప్పుడు షాక్​ అయిన అట్లీ.. శంకర్​ చెప్పినట్టుగానే.. స్టైల్‌గా డైలాగ్స్‌ చెబుతూ చేసి చూపించారు. దానికే ఇంకాస్త మెరుగులు అద్ది రజనీకాంత్​ ఇంకాస్త అదరగొట్టారు. సీన్‌ అద్భుతంగా వచ్చింది. అప్పటి నుంచి షూటింగ్‌ పూర్తయ్యేవరకు.. రజినీకాంత్‌ రోబోకి అట్లీనే డూప్‌గా చేశారు. రోబో చిత్రం తర్వాత విజయ్‌ హీరోగా వచ్చిన స్నేహితుడు చిత్రానికి అసోసియేట్‌గా మారారు! ఆ తర్వాత రాజారాణితో తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్​ను అందుకున్నారు. అనంతరం ఏడాది తర్వాత ఆయన పెళ్ళి అయింది.

Jawan Oscar : షారుక్ 'జవాన్'​కు ఆస్కార్​ రేంజ్ సత్తా ఉందా?

Jawan Shahrukh : 'జవాన్' విషయంలో నయన్​ అప్సెట్​.. ఇక హిందీ చిత్రాలు బంద్​!.. అసలేం జరిగిందంటే?

ABOUT THE AUTHOR

...view details