Animal Movie US Collections : రణ్బీర్ కపూర్ లీడ్ రోల్లో తెరకెక్కిన యానిమల్ మూవీ ఎంతటి సక్సెస్ను సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా లెవెల్లో డిసెంబర్ 1న విడుదలైన ఈ సిినిమా 12 రోజుల్లో సూమారు 757 కోట్లు సాధించి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద యానిమల్ దుమ్ములేపేస్తోంది. తెలుగులో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటిపోయిన మూవీ హిందీ వెర్షన్లోనూ ఓ రేంజ్లో వసూళ్లు అందుకుని ఆకట్టుకుంది.
అయితే ఓవర్సీస్లో మాత్రం ఈ సినిమా తెలుగు వెర్షన్ కాస్త డీలా పడ్డట్లు తెలుస్తోంది. విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడి థియేటర్లలో 'యానిమల్' సక్సెస్ఫుల్గా రన్ అవుతునప్పటికీ తెలుగు వెర్షన్లో ఈ సినిమా వన్ మిలియన్ డాలర్లను కూడా దాటలేదట. అయితే ఇటీవలే విడుదలైన 'హాయ్ నాన్న' సినిమా అక్కడ ఓ రేంజ్లో దూసుకెళ్తోందని సమచారం. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ సినిమా ఓవర్సీస్లో 1.3 మిలియన్ డాలర్లు మార్క్ అందుకుందట. ఈ క్రమంలో వారం ముందే విడుదలైన యానిమల్ను బీట్ చేసింది. అయితే యానిమల్ హిందీ వెర్షన్ చూసేందుకు యూఎస్ అభిమానులు క్యూ కడుతున్నట్లు సమాచారం. ఒక్క కెనడాలోనే ఆరు మిలియన్లకు పైగా వసూళ్లు సాధించిందట.