Johny Depp case Elon Musk: పైరెట్స్ ఆఫ్ ది కరీబియన్ ఫేమ్, హాలీవుడ్ స్టార్ హీరో జానీడెప్ విడాకుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తన మాజీ భార్య, ప్రముఖ నటి అంబర్హెర్డ్పై రూ.380 కోట్ల పరువు నష్టం కేసు దాఖలు చేసిన జానీ డెప్.. దీనిపై వర్జీనియాలోని ఫెయిర్ఫాక్స్లోని కౌంటీ కోర్టులో జరిగిన విచారణకు హాజరయ్యారు. తన భార్య ఎప్పుడూ తనను మానసికంగా వేధించేదని కోర్టులో ఆరోపించారు. 'అంబర్హెర్డ్ ఆరోపణలు చాలా దారుణమైనవి.. బాధకలిగించేలా ఉన్నాయి. నా జీవితంలో ఏ మహిళపైనా నేను చెయ్యి చేసుకోలేదు' అని జానీ డెప్ చెప్పుకొచ్చారు.
అయితే, అంబర్ హెర్డ్ను కుళ్లిపోయిన శవంగా జానీడెప్ అభివర్ణిస్తూ తన స్నేహితుడికి సందేశాలు పంపాడని నటి తరఫున హాజరైన న్యాయవాది వాదించారు. ఈ మేరకు ఆ స్నేహితుడిని కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో పాటు ఆమెను దుర్భాషలాడుతూ వ్యాఖ్యలు చేశారని కోర్టులో ఆరోపించారు. మరోవైపు, అంబర్హెర్డ్ తనపై చెయ్యి చేసుకున్నారని.. నటి ఇంట్లో పని చేసిన మహిళ ఆరోపించారు. జీతం పెంచాలని అడిగినందుకు చెంప ఛెళ్లుమనిపించారని అన్నారు. ఏ కారణాలు లేకుండానే అప్పుడప్పుడూ ఆరిచేవారని చెప్పుకొచ్చారు. కాగా, జానీ డెప్పై అంబర్హెర్డ్ ఇదివరకే రూ.760 కోట్ల పరువునష్టం వ్యాజ్యం దాఖలు చేశారు.