ETV Bharat / entertainment

'రాజాసాబ్' కోసం ముగ్గురు భామలు - ఆ సాంగ్​లో ప్రభాసే హైలైట్​! - Prabahs The Raja Saab Movie

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 30, 2024, 6:49 AM IST

The Raja Saab Movie Song
The Raja Saab Movie Song

The Raja Saab Movie Song : ప్రభాస్, మారుతి కాంబినేషన్​లో రానున్న ది రాజా సాబ్ మూవీ నుంచి ఓ సాలిడ్ అప్​డేట్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ కోసం ఓ స్పెషల్ సాంగ్​ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అయితే అందులో ప్రభాసే హైలైట్​గా నిలవనున్నారట. మరీ ఆ సాంగ్ ఏంటంటే ?

The Raja Saab Movie Song : రెబల్ స్టార్ ప్రభాస్​, డైరెక్టర్ మారుతి కాంబోలో వస్తున్న రాజాసాబ్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే హీరో ప్రభాస్ పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు సెట్స్​లోకి అడుగుపెట్టారు. అయితే తాజాగా ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

అదేంటంటే, ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్​లో ప్రభాస్​ ముగ్గురు హీరోయిన్లతో కలిసి స్టెప్పులేయనున్నారట. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్​తో చిత్రీకరించనున్న ఆ పాటలో ప్రభాసే హైలైట్​గా నిలవనున్నారని టాక్ నడుస్తోంది. దీని కోసమని మేకర్స్ భారీ ప్లాన్​ చేస్తున్నారని సమాచారం. ఇది విన్న ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బితబ్బిపోతున్నారు. వింటేజ్ ప్రభాస్​ను మళ్లీ చూడొచ్చు అంటూ సంబరపడుతున్నారు.

బాహుబలి ముందు ప్రభాస్ చేసిన పలు సినిమాల్లో ఆయన యాక్టింగ్​తోనే కాకుండా తన డ్యాన్స్​ మూవ్స్​తోనూ ఆకట్టుకున్నారు. అయితే బాహుబలి తర్వాత వచ్చిన 'బాహుబలి 2', 'సాహో', 'రాధేశ్యామ్' లాంటి సినిమాల్లో డ్యాన్స్​కు అంత స్కోప్ లేకుండా పోయింది. సాహోలో మాత్రం సైకో సయ్యాన్​ అనే సాంగ్​కు మాత్రమే ఆయన స్టెప్పులేశారు. దీంతో ఫ్యాన్స్​ నిరాశలో ఉన్నారు. మునపటి ప్రభాస్​ను ఎప్పుడు చూస్తామా అంటూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సాంగ్​తో వారికి మాస్​ ట్రీటే ఇవ్వనున్నారు డైరెక్టర్ మారుతి. ​

ఇక రాజాసాబ్​ విషయానికి వస్తే - హారర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్​తో పాటు నిధి అగర్వాల్‌, మాళవిక మోహన్, రిద్ది కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్​పై ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే 2025 వరకు ఈ చిత్రం థియేటర్లలోకి రాదని తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రభాస్ ఫస్ట్ లుక్​ పోస్టర్ ఫ్యాన్స్​ను బాగానే ఆకట్టుకుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'రాజాసాబ్' సెట్స్​లోకి ప్రభాస్ ఎంట్రీ - న్యూ లుక్​లో ఎలా ఉన్నారంటే ? - Prabhas New Look

'ఫ్యాన్స్​కు రాజాసాబ్ VFX ట్రీట్- అంచనాలు మించి ఉంటుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.