ఓటీటీలోకి మిషన్ ఇంపాజిబుల్... సర్కారు వారి 'పాట' అప్డేట్!

author img

By

Published : Apr 21, 2022, 7:15 PM IST

Updated : Apr 21, 2022, 7:52 PM IST

CINEMA UPDATES

CINEMA UPDATES Telugu: సినీ అప్డేట్స్ వచ్చేశాయి. సూపర్​స్టార్ మహేశ్​బాబు సర్కారు వారి పాట, తాప్సి మిషన్ ఇంపాజిబుల్ సహా పలు చిత్రాల సంగతులు ఇందులో ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..

Sarkaru vaari paata update: సూపర్​స్టార్ మహేశ్​బాబు మోస్ట్ అవైటెడ్ మూవీ 'సర్కారు వారి పాట'. వరుస హిట్​లతో దూసుకెళ్తున్న మహేశ్​.. దర్శకుడు పరశురాంతో కలిసి తీస్తున్న సినిమా ఇది. దీంతో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదివరకు విడుదలైన టీజర్, పాటలు ఆ అంచనాలను మరింత పెంచాయి. కళావతి పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. మరో పాట 'పెన్నీ'లో మహేశ్ ముద్దుల కూతురు సితార సందడి చేసి సినిమాకు స్పెషల్ అట్రాక్షన్​గా మారింది. దీంతో సినిమా తర్వాతి అప్డేట్ కోసం అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే చిత్రబృందం త్వరలో మరో పాట విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మే 1న ఇందుకు సంబంధించిన అప్డేట్ రానున్నట్లు సినీ వర్గాల్లో టాక్!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

mission impossible Taapsee OTT: తాప్సీ కీలక పాత్ర పోషించిన 'మిషన్‌ ఇంపాజిబుల్‌' చిత్రం ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమా ఏప్రిల్‌ 29 నుంచి 'నెట్‌ఫ్లిక్స్‌'లో స్ట్రీమ్ కానుంది. తామెంతో ఫేమస్‌ అవ్వాలి, లెక్కపెట్టలేనంత డబ్బు సంపాదించాలనుకునే ముగ్గురు చిన్నారుల కథ ఇది. థియేటర్లలో ఇటీవల విడుదలై అలరించింది. స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే దర్శకత్వం వహించిన ఈ సినిమాతో హర్ష రోషన్‌, భాను ప్రకాశ్‌, జైతీర్థ అనే ముగ్గురు బాల నటులు వెండి తెరకు పరిచయమయ్యారు. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం: మార్క్‌ కే రాబిన్‌, కూర్పు: రవితేజ గిరిజాల, ఛాయాగ్రహణం: దీపక్‌ యెరగరా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Leharai motion poster: మరోవైపు, లక్కీ మీడియా సంస్థ అధినేత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో నూతన నటీనటులు రంజిత్, సౌమ్య మీనన్ జంటగా నటించిన చిత్రం లెహరాయి. రామకృష్ణ పరమహంస దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్ఎల్ఎస్ మూవీస్ పతాకంపై మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మించారు. చిత్రీకరణ పూర్తి చేసుకొని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న లెహరాయి మోషన్ పోస్టర్​ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్​లో లాంఛనంగా విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు విజయ్ కుమార్ కొండ ముఖ్య అతిథిగా హాజరై లెహరాయి పోస్టర్​ను ఆవిష్కరించారు. గగన్ విహారి, రావురమేష్, నరేష్, అలీ, సత్యం రాజేశ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.

CINEMA UPDATES
లెహరాయి పోస్టర్

శేఖర్ మాస్టర్ సమర్పణలో..: 1996లో ధర్మపురి గ్రామంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా నిర్మించిన చిత్రం ధర్మపురి. శేఖర్ మాస్టర్ సమర్పణలో ప్రముఖ దర్శకుడు మారుతీ వద్ద సహాయదర్శకుడిగా పనిచేసిన జగత్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గగన్ విహారి, అపర్ణదేవి జంటగా నటించిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా కథానాయకుడు గగన్ విహారి, దర్శకుడు జగత్, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్​లు ధర్మపురి విశేషాలను దర్శకుడు మారుతితో పంచుకున్నారు. ఆ ఇంటర్వ్యూ చూసేయండి..

ధర్మపురి చిత్ర యూనిట్ ఇంటర్వ్యూ

ఇదీ చదవండి:

'మళ్లీ కలవలేమని నాన్న చెప్పారు.. హత్తుకొని ఏడ్చేశా!'

'దోస్తీ' వీడియో సాంగ్ రిలీజ్.. అప్పుడే లక్షల్లో వ్యూస్

Last Updated :Apr 21, 2022, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.