తెలంగాణ

telangana

గుర్తు తెలియని మృతదేహం లభ్యం.. కేసు నమోదు

By

Published : Mar 24, 2021, 8:17 PM IST

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అతను చనిపోయి మూడు రోజులై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

unknown body
గుర్తు తెలియని మృతదేహం లభ్యం.. కేసు నమోదు

సంగారెడ్డి జిల్లాలో రామచంద్రాపురం పీఎస్‌ పరిధిలోని అశోక్‌నగర్‌లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మృతుని వయసు దాదాపు 42 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

మృతదేహం కుళ్లిపోయి ఉండడంతో చనిపోయి మూడు రోజులై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అతను నిద్రలోనే మృతిచెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:రూ.11.63 కోట్ల విలువైన 25 కిలోల బంగారం స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details