తెలంగాణ

telangana

విషాదం: వేరువేరు ఘటనల్లో ఇద్దరు యువకుల బలవన్మరణం

By

Published : Jan 29, 2021, 5:18 PM IST

సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో వేరువేరు ఘటనల్లో ఇద్దరు యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఉద్యోగ పని భారం ఎక్కువవుతుందని ఒకరు, కుటుంబసభ్యులు మందలించారని మరొకరు బలవన్మరణాలకు పాల్పడ్డారు. కన్నవారికి కడుపుకోత మిగిల్చారు.

two young mens suicide in separate incidents in siddipet district
విషాదం: వేరువేరు ఘటనల్లో ఇద్దరు యువకుల బలవన్మరణం

సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్దమాసంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పన్యాల నవీన్ రెడ్డి అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తమ పొలం వద్ద ఉన్న చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

నవీన్​ రెడ్డి బీటెక్ పూర్తి చేసి, హైదరాబాద్​లో సాఫ్ట్​వేర్​ ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో వర్క్​ ఫ్రం హోమ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పని భారం ఎక్కువవుతుందని ఇటీవల తల్లిదండ్రులకు తెలిపాడు. సానుకూలంగా స్పందించిన వారు.. తనకు నచ్చిన పని చేసుకోమని నవీన్​రెడ్డికి సూచించారు. ఉద్యోగం మానేస్తే తల్లిదండ్రులు బాధపడతారని మనస్తాపం చెందిన నవీన్​.. రోజులాగే వ్యవసాయ పొలం వద్ద వర్క్ ఫ్రం హోమ్ చేసేందుకు వెళ్లి అక్కడే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతసేపటికీ నవీన్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా.. విగతజీవిగా కనిపించాడు. 'అమ్మా-నాన్న సారీ.. నా చావుకు ఎవరూ కారణం కాదు' అంటూ సూసైడ్ నోట్ రాసుకుని జేబులో పెట్టుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

కుటుంబసభ్యులు మందలించడంతో..

గుడికందుల గ్రామానికి చెందిన ఎడ్ల గణేశ్​ అనే యువకుడు ఇటీవల తన బావ వద్దకు వెళ్లాడు. వచ్చేటపుడు బావ ద్విచక్ర వాహనాన్ని తీసుకొచ్చాడు. దీంతో కుటుంబసభ్యులు మందలించారు. మనస్తాపం చెందిన గణేశ్​ నాలుగు రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఆచూకీ కోసం బంధువులు, స్నేహితుల వద్ద ఆరా తీసినా.. ఫలితం లేకపోయింది.

నేడు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఉన్న గణేశ్​ను గుర్తించాడు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలికి చేరుకుని బోరున విలపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: కిడ్నాప్​ కేసు: క్షేమంగా తల్లి ఒడికి చేరిన చిన్నారి

ABOUT THE AUTHOR

...view details