తెలంగాణ

telangana

Fake notes printing: నకిలీ నోట్లు కలకలం.. ముగ్గురు అరెస్టు

By

Published : Jan 6, 2023, 3:29 PM IST

Fake notes printing in YSR District
Fake notes printing in YSR District

Fake notes printing in YSR District: ఏపీలో మరోసారి నకిలీ నోట్ల కలకలం రేగింది. నకిలీ నోట్లు ముద్రించి, చలామణి చేస్తున్న ముగ్గురిని కడప జిల్లాలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి ముద్రించిన నకిలీ నోట్లతోపాటు ల్యాప్‌టాప్‌, కలర్‌ ప్రింటర్‌, ల్యామినేటర్‌, కట్టర్‌, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Fake notes printing in YSR District: నకిలీ నోట్ల ముద్రించి, చలామణి చేస్తున్న ముగ్గురిని కడప జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. వీరి నుంచి ముద్రించిన నకిలీ నోట్లతోపాటు ల్యాప్‌టాప్‌, కలర్‌ ప్రింటర్‌, ల్యామినేటర్‌, కట్టర్‌, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దువ్వూరు మండలం పూలమార్కెట్‌ వద్ద నకిలీనోట్లు చలామణి చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

దీంతో గుంటూరు జిల్లాకు చెందిన పేర్ల యేసు, నెహ్రూనగర్‌కు చెందిన గంగవరపు సాగర్‌రెడ్డి, ప్రకాశం జిల్లాకు చెందిన యంగనంపల్లె కోటేశ్వరరావులను అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ వంశీధర్‌గౌడ్‌ వెల్లడించారు. మైదుకూరు పట్టణంలోని ఒక లాడ్జీని కేంద్రంగా చేసుకుని నకిలీనోట్లను ముద్రిస్తున్నట్లుగా విచారణలో వెల్లడైందని తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details