తెలంగాణ

telangana

హైదరాబాద్‌లో ఉగ్రదాడిని భగ్నం చేసిన పోలీసులు.. ముగ్గురి అరెస్ట్

By

Published : Oct 2, 2022, 8:43 PM IST

Updated : Oct 2, 2022, 9:22 PM IST

Police Foil Terror Attack in Hyderabad

Police Foil Terror Attack in Hyderabad: హైదరాబాద్‌లో ఉగ్రదాడిని పోలీసులు భగ్నం చేశారు. జన సమూహాలు, బహిరంగ సభలపై గ్రనేడ్లు విసిరి ఉగ్రవాద, మత కలహాలు సృష్టించడమే లక్ష్యంగా పని చేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి నాలుగు హ్యాండ్​ గ్రనేడ్లు, రూ.ఐదున్నర లక్షల నగదు, ఐదు సెల్​ఫోన్​లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. దిల్‌సుఖ్​నగర్ సహా పలు పేలుళ్లకు పాకిస్థాన్ నుంచి కుట్రపన్నిన నిందితులే మరోసారి వాహెద్ ద్వారా దాడులకు తెగబడేదుంకు యత్నించినట్లు పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్‌లో ఉగ్రదాడిని భగ్నం చేసిన పోలీసులు.. ముగ్గురి అరెస్ట్

Police Foil Terror Attack in Hyderabad: హైదరాబాద్​లో మరోసారి ఉగ్ర కదలికలు కలకలం సృష్టిచాయి. ఎట్టకేలకు పోలీసులు వారి కుట్రను భగ్నం చేశారు. పాకిస్థాన్‌లో ఉండి హైదరాబాద్‌లో పలు పేలుళ్లతో సంబంధమున్న ఫర్హతుల్లా గోరి, అబ్దుల్‌ మాజిద్‌, అబు అంజాలాలతో సత్సంబంధాలు కొనసాగిస్తుండటంతో జాహెద్‌పై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది. గతంలో బేగంపేట, గణపతి దేవాలయం కేసుల్లో జాహెద్‌ను పోలీసులు విచారించారు.

తాజాగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం రాత్రి జరిపిన సోదాల్లో జాహెద్ సహా ముగ్గురిని అరెస్ట్ చేసి వారి నుంచి నాలుగు గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. అబ్దుల్ జాహెద్‌తో చర్చలు జరిపిన ఉగ్రవాదులు అతనికి ఆర్ధిక సహాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దాడులు చేసేందుకు యువతను రిక్రూట్ చేసుకోమని జాహెద్‌కు చెప్పగా.. సైదాబాద్‌కు చెందిన సమీయుద్దీన్, మెహదీపట్నంకు చెందిన మాజ్‌హసన్ ఫారుకిలను జాహెద్ రిక్రూట్ చేసుకున్నాడు.

వీరితో కలిసి జాహెద్ జన సమూహాలపై ఒక్కొక్కరిగా వెళ్లి గ్రనేడ్లు విసరడం, బహిరంగ సభలపై గ్రనేడ్లు విసిరేందుకు కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. పాకిస్థాన్ ఉగ్రవాదుల నుంచి దాడులకు శిక్షణ పొందినట్లు గుర్తించారు. దాడులు కోసం పాకిస్థాన్ ఉగ్రవాద హ్యాండ్లర్ల నుంచి గ్రనేడ్లను సేకరించినట్లు గుర్తించిన పోలీసులు.. ఏ విధంగా చేరారన్నదానిపై దృష్టి సారించారు.

గ్రనేడ్లు విసిరి దాడి చేయడమే లక్ష్యం:గుంపులుగా ఉన్న ప్రజల్లోకి గ్రనేడ్లు విసిరి దాడి చేయడమే లక్ష్యంగా ఉన్నట్లు పోలీసుల విచారణలో జాహెద్ వెల్లడించాడు. తరచూ జాహెద్‌ను మరో ఇద్దరు నిందితులు కలిసినట్లు ఆధారాలు సేరిస్తున్నారు. వారి బ్యాంకు ఖాతా వివరాలు, కాల్ డేటా, సామాజిక మాధ్యమాలు పరిశీలిస్తున్నారు. వీరితో పాటు ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యప్తు చేస్తున్నారు.

ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు: ముగ్గురు నిందితులను మలక్​పేటలో అదుపులోకి తీసుకున్న టాస్క్​ఫోర్స్ పోలీసులు లోతుగా విచారిస్తున్నారు . ప్రధాన నిందితుడు అబ్దుల్ జాహెద్ నుంచి రెంబడ్ గ్రనేడ్లు, రూ.4 లక్షల నగదు, రెండు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. సైదాబాద్‌కు చెందిన సమీయుద్దీన్ నుంచి ఒక గ్రేనేడ్, లక్షన్నర రూపాయల నగదు, ద్విచక్ర వాహనం, చరవాణి స్వాధీనం చేసుకున్నారు. మెహిదీపట్నంకు చెందిన మాజ్‌హసన్ నుంచి ఒక గ్రేనేడ్, రెండు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. వీరిని ప్రస్తుతం పోలీసులు ఒక రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు.

అంతకుముందు హైదరాబాద్‌లో పలు పేలుళ్ల కేసులో పరారీలో ఉన్న ఫర్హతుల్లా గోరి, అబ్దుల్‌ మాజిద్, అబు అంజాలాలు పరారీలో ఉన్నారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో సెటిలైన వీరు భాగ్యనగరంలోని పలు పేలుళ్లలో కీలకంగా వ్యవహరించారు. స్థానిక యువతను రిక్రూట్ చేసుకుని ఉగ్రదాడులకు తెగబడ్డారు. 2002లో దిల్‌సుఖ్​నగర్ , ముంబైలో బస్సు పేలుడు.. 2005లో బేగంపేట టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో మానవ బాంబు పేలుళ్లలో కీలకంగా వ్యవహరించారు.

సికింద్రాబాద్ గణపతి దేవాలయం పేలుళ్ల కేసులోనూ ఈ ముగ్గురు కీలకంగా వ్యవహరించారు. నిందితులను రేపు కోర్టులో హాజరు పరచనున్న పోలీసులు.. మరింత సమాచారం సేకరించేందుకు కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థలు కూడా ఈకేసుపై దృష్టి సారించే అవకాశం ఉంది.

ఇవీ చదవండి:చెరువులో ఈతకు వెళ్లి నలుగురు పిల్లలు మృతి

ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి చిన్నారి మృతి.. ఛార్జింగ్​ అవుతుండగానే..

Last Updated :Oct 2, 2022, 9:22 PM IST

ABOUT THE AUTHOR

...view details