తెలంగాణ

telangana

STUDENT SUICIDE: అపార్ట్​మెంట్​ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి... అసలేం జరిగిందంటే?

By

Published : Nov 11, 2021, 11:39 AM IST

ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి అపార్ట్​మెంట్​ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బోయిన్​పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

STUDENT SUICIDE
STUDENT SUICIDE

అనారోగ్యంతో బాధపడుతున్న ఓ విద్యార్థి అపార్ట్​మెంట్ ​పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సికింద్రాబాద్ బోయిన్​పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నిజామాబాద్​కు చెందిన వజీర్, సీమా ఫాతిమా దంపతులకు ముగ్గురు కుమారులు. వారిని చదివించడానికి గత కొద్ది సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి... న్యూ బోయిన్‌పల్లి వద్ద గల కాలనీలో నివాసముంటున్నారు. తండ్రి దుబాయ్​లో పనిచేస్తుండగా... సీమాఫాతిమా ఇంట్లోనే ఉంటూ పిల్లల ఆలనాపాలనా చూసుకుంటుంది.

చిన్న కుమారుడు మహమ్మద్​ ఓబేద్ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుకుంటున్నాడు. గత కొంతకాలంగా క్యాన్సర్​తో బాధపడుతున్న ఓబేద్​కు చిన్నాన్న నజీబ్ చికిత్స చేయిస్తున్నాడు. అయితే అనారోగ్యంతో మనస్తాపం చెందిన ఓబేద్​... పాఠశాలకు వెళ్లి ఇంటికి వచ్చే మార్గంలోని లోటస్ స్ప్రింగ్ అపార్ట్​మెంట్​లోని నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:Attack on Girl friend:ప్రేమోన్మాది దాడి.. విషమంగానే యువతి పరిస్థితి

ABOUT THE AUTHOR

...view details