ETV Bharat / crime

Attack on Girl friend:ప్రేమోన్మాది దాడి.. విషమంగానే యువతి పరిస్థితి

author img

By

Published : Nov 11, 2021, 5:41 AM IST

Updated : Nov 11, 2021, 7:22 AM IST

ఇద్దరూ ప్రేమించుకున్నారు. వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. కానీ, యువతి తల్లిదండ్రులు అందుకు అడ్డుపడ్డారు. ఆమెకు మరొకరితో నిశ్చితార్థం జరిపించారు. దీంతో పగపట్టిన యువకుడు... యువతిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు (lover attack on his girl friend). ఏకంగా 18 సార్లు పొడిచి ఆమెను అంతమొందించడానికి ప్రయత్నించాడు (murder attempt). హైదారాబాద్‌ ఎల్బీనగర్​ పరిధిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఆమె శరీరంపై 18 చోట్ల గాయలున్నట్లు గుర్తించిన వైద్యులు.. 48 గంటలు గడిస్తే గాని ఓ అంచనాకు రాలేమని తెలిపారు.

attack
attack

యువతిపై ప్రేమోన్మాది దాడి.. 18 కత్తిపోట్లు.. కారణం అదేనా..?

వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలం చంద్రకల్‌కు చెందిన యువతికి, అదే గ్రామానికి చెందిన బస్వరాజ్‌తో (baswaraj) కొన్ని నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. శిరీష, బస్వరాజ్‌ ఇద్దరు హైదరాబాద్‌కు వచ్చి వేర్వేరుగా ఉంటున్నారు. హస్తినాపురంలోని తన పిన్ని ఉమశ్రీ వద్ద ఉంటోంది. వీరి ప్రేమను యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. మూడు నెలల క్రితం ఆమెకు మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిపించారు. కక్ష పెంచుకున్న బస్వరాజ్‌.... పథకం ప్రకారం యువతిపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు.

చావు బతుకుల మధ్య..

తన ప్రియురాలిని వేరే ఇంటికి తరలించారన్న వార్త తెలుసుకుని.. ఆమె ఉంటున్న ఇంటి చిరునామా కోసం బసవరాజు​ తీవ్రంగా వెతికాడు. మొత్తానికి ఆమె చిరునామా కనుక్కున్నాడు. ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలిపై కోపంతో.. కర్కషంగా దాడి చేశాడు (lover attack on his girl friend). తన వెంట తెచ్చుకున్న కత్తితో యువతి కడుపు, వెన్నులో పొడిచాడు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా మారింది. ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

వేరొకర్ని పెళ్లి చేసుకుంటున్నానని బస్వరాజు పొడిచాడు. గతంలో మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఇంట్లో ఒప్పుకోలేదు. ఇప్పుడు వేరే వ్యక్తితో నిశ్చితార్థమైంది. రోడ్డు మీద అందరూ చూస్తుండగా కత్తితో పొడిచాడు. - బాధితురాలు

48 గంటలు గడిస్తే గాని ఓ అంచనాకు రాలేము

ఆమె శరీరంపై 18 చోట్ల గాయలున్నట్లు గుర్తించిన వైద్యులు వాటిలో.. ఆరు ప్రదేశాల్లో గాయాల తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. బాధితురాలు కోలుకునేందుకు శ్రమిస్తున్నామని.. 48 గంటలు గడిస్తే గానీ ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఒక అంచనాకు రాలేమని వైద్యులు చెబుతున్నారు.

ఆస్పత్రికి తీసుకొచ్చే సమయంలో చాలా రక్తస్రావం జరిగింది. 48 గంటల తర్వాత ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేస్తాం. మేజర్​గా ఏమైనా గాయాలైనాయి అనేది స్కానింగ్​ తర్వాత తెలుస్తుంది. సుమారుగా 18 గాయాలు ఉన్నాయి. ఇంటర్నల్​గా ఏమైనా గాయాలు ఉన్నట్లు తేలితే దాన్నిబట్టి చికిత్స చేస్తాం. -వైద్యులు

పోలీస్​ స్టేషన్​లో లొంగిపోయిన నిందితుడు..!

బాధితురాలి అరుపులు విని స్థానికులు రావడంతో బస్వరాజ్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్టు సమాచారం. యువతిపై దాడి చేసిన బస్వరాజ్​ను కఠినంగా శిక్షించాలని బాధితురాలి బంధువులు, స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు బస్వరాజ్‌ను విచారిస్తున్నారు. ఇవాళ అతన్ని కోర్టులో హాజరుపరచనున్నారు.

ఇదీ చూడండి: Road Accident: విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం

Last Updated : Nov 11, 2021, 7:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.