తెలంగాణ

telangana

Kamareddy Accident: దర్గా నుంచి తిరిగొస్తుండగా ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం..

By

Published : Dec 18, 2021, 2:05 PM IST

Updated : Dec 18, 2021, 9:30 PM IST

kamareddy accident, car hits lorry
లారీని ఢీకొట్టిన కారు

14:02 December 18

Kamareddy Accident: దర్గా నుంచి తిరిగొస్తుండగా ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం..

లారీని ఢీకొన్న కారు.. ఆరుగురు దుర్మరణం

Kamareddy Accident: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓ కారు వెనుక నుంచి ఢీ కొట్టగా.. ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. పెద్దకొడప్గల్‌ మండలం జగన్నాథ్‌పల్లి గేట్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. బిచ్కుంద నుంచి పిట్లం వైపు వెళ్తున్న కారు.. అతివేగంగా వచ్చి ఆగిఉన్న లారీని ఢీ కొట్టింది. ప్రమాదంలో.. డ్రైవర్‌ కారులో ఇరుక్కుపోయి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 12 మంది ఉన్నారు. మొత్తం ఆరుగురు ఆక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో చిన్నారి చికిత్స పొందుతూ మరణించింది. ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, మరో ఇద్దరు మహిళలు ఉన్నారు.

అతివేగమే కారణం..

హైదరాబాద్​లోని మలక్​పేట్, చాదర్​ఘాట్​కు చెందిన రెండు కుటుంబాలు మహారాష్ట్రలోని నాందేడ్ సమీపంలో ఉన్న ఓ దర్గాకు రెండు రోజుల కింద వెళ్లారు. దర్శనం అనంతరం ఈరోజు తిరుగు ప్రయాణం కాగా.. మార్గమధ్యలో ప్రమాదం బారిన పడ్డారు. వాహనంలో ప్రయాణిస్తున్న రెండు కుటుంబాల్లో డ్రైవర్‌ అమీర్‌తాజ్(30), భార్య సనా ఫాతిమా(28).. వాళ్ల పిల్లలు హనియా(2), హన్నాన్ (4నెలలు), హుస్సేన్(35), తస్లిం బేగం(30) దంపతులు ప్రమాద సమయంలోనే ప్రాణాలు వదిలారు. ఒక యువతితో పాటు మరో ఐదుగురు పిల్లలు తీవ్రంగా గాయపడగా.. క్షతగాత్రులందరిని బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. నూరా‍(7) తుదిశ్వాస విడిచింది. మిగతా ఐదుగురికి చికిత్స కొనసాగుతోంది. మిగతావారికి ప్రాణాపాయం లేదని బాన్సువాడ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. అతి వేగమే ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

బండి సంజయ్​ దిగ్బ్రాంతి..

ఈ ప్రమాదం పట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుండటం పట్ల బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:

Last Updated : Dec 18, 2021, 9:30 PM IST

ABOUT THE AUTHOR

...view details