తెలంగాణ

telangana

Sarpanch Suicide: అప్పులు చేసి అభివృద్ధి చేశాడు.. బిల్లులు రాక ఉసురు తీసుకున్నాడు

By

Published : Feb 9, 2023, 7:30 PM IST

Sarpanch suicide in sangareddy district: ఊళ్లో పలు అభివృద్ధి పనులు చేశాడు. చేసిన పనులకు సకాలంలో బిల్లులు రాక ఆవేదనతో బలవన్మరణానికి పాల్పడ్డాడు ఓ సర్పంచ్​. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

సర్పంచ్​ ఆత్మహత్య
సర్పంచ్​ ఆత్మహత్య

Sarpanch suicide in sangareddy district: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం పెద్దముబారక్​పూర్ సర్పంచ్ దిగంబర్ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆరోగ్యం బాగోలేదంటూ.. చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక గ్రామానికి న్యాయం చేయలేకపోతున్నానని ఈ నెల 1న ఆయన తన సర్పంచ్​ పదవికి రాజీనామా చేశారు. ఆయన అకస్మాత్తుగా బుధవారం రాత్రి చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిర్గాపూర్ ఎస్సై నారాయణ తెలిపారు.

సర్పంచ్ దిగంబర్

చేసిన పనులకు బిల్లులు రాక.. అప్పులు ఎలా తీర్చాలనే ఆవేదనతో ఉప సర్పంచ్‌ ఆత్యహత్య చేసుకున్న ఘటన ఇటీవల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. కాటారం మండలం చిదినేపల్లి పంచాయతీ ఉప సర్పంచ్ బాల్నే తిరుపతి అప్పు తీసుకొని పంచాయతీ పనులు చేయించాడు. అయితే సకాలంలో బిల్లులు రాకపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలనే ఆవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details