తెలంగాణ

telangana

గుడిసెకు మంటలంటుకొని వృద్ధ దంపతులు సజీవదహనం

By

Published : Apr 16, 2021, 9:57 AM IST

Updated : Apr 16, 2021, 2:24 PM IST

సిద్దిపేట జిల్లాలో వృద్ధ దంపతులు సజీవదహనం
సిద్దిపేట జిల్లాలో వృద్ధ దంపతులు సజీవదహనం

09:55 April 16

వృద్ధ దంపతులు సజీవదహనం

వృద్ధ దంపతులు సజీవదహనం

చుట్ట తాగి... ఆర్పకుండా పడేయడంతో గుడిసె దగ్ధమై నిద్రి‌స్తున్న వృద్ధ దంపతులు సజీవ దహనమైన విషాధ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. కోహెడ మండలం తంగళ్లపల్లికి చెందిన నర్సయ్య, లచ్చమ్మ పక్షవాతంతో బాధపడుతూ... గుడిసెలో నివాసం ఉండేవారు. నర్సయ్య చుట్ట తాగి ఆర్పకుండా పడేయడంతో ప్రమాదం జరిగిందని అతని కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

వీరికి ముగ్గురు కుమారులు ఉండగా... వారు ఉపాధి నిమిత్తం వేరే ప్రాంతాల్లో స్థిరపడ్డారు. గుడిసెకు నిప్పంటుకున్న విషయాన్ని ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. గుడిసెలోకి వెళ్లి చూడగా అప్పటికే ఆ వృద్ధ దంపతులు కాలిన గాయాలతో మృతిచెందారు.

ఇవీచూడండి:రోడ్డు పక్కనున్నవారిపైనుంచి దూసుకెళ్లిన లారీ... ముగ్గురు మృతి

Last Updated : Apr 16, 2021, 2:24 PM IST

ABOUT THE AUTHOR

...view details