తెలంగాణ

telangana

Daughter Killed Mother: తల్లిని చంపిన కుమార్తె.. ప్రియుడి సహకారంతో ఘాతుకం

By

Published : Sep 11, 2021, 10:49 AM IST

Updated : Sep 11, 2021, 1:37 PM IST

daughter who murdered the step mother at Rajendranagar, hyderabad
తల్లిని హత్య చేసిన కుమార్తె.. ప్రియుడి సహకారంతో ఘాతుకం

10:46 September 11

తల్లిని చంపిన కుమార్తె

        ప్రియుడి మోజులోపడిన దత్త పుత్రిక ఘోరానికి పాల్పడింది. ఆశ్రయమిచ్చిన అమ్మనే అమానుషంగా హత్యచేసింది. అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిని కనికరం లేకుండా ప్రాణాలు తీసి గుట్టుచప్పుడు కాకుండా ఊరుబయట రోడ్డు పక్కన పడేసింది. మృతురాలు మూడు రోజులుగా కనిపించకపోవడంతో ఆమె అల్లుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెంపుడు కూతురిపై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు నిజం బయటపడింది.

అసలేం జరిగిందంటే...

               రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కిస్మత్‌పురకు చెందిన మేరీ క్రిస్టియన్ అనే మహిళ మారిక స్కూల్‌ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. ఈమెకు ఇద్దరు కుమార్తెలు. వారికి వివాహం జరిపించింది. ఆదర్శభావాలు కలిగిన మేరీ క్రిస్టియన్ ఓ ఆశ్రమం నుంచి రూమా అనే యువతిని దత్తత తీసుకుని పెంచుకుంటోంది. రూమా ఓ యువకుడితో ప్రేమాయణం కొనసాగించింది. ప్రియుడితో కలిసి పెంపుడు తల్లి మేరీ క్రిస్టియన్‌ను మూడు రోజుల క్రితం మెడకు కొబ్బరితాడుతో ఉరివేసి చంపారు. 

        అనంతరం దుప్పట్లో చుట్టి హిమాయత్‌సాగర్‌ చెరువు సమీపంలోని రహదారి పక్కన పడేసి వెళ్లిపోయారు. మూడు రోజులుగా మేరి క్రిస్టియన్ కనిపించకపోవడంతో ఆమె సొంత కుమార్తె.. భర్త రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దత్త పుత్రిక రూమాను విచారించడంతో హత్య చేసినట్లు అంగీకరించి మృతదేహాన్ని చూపించిందని రాజేంద్రనగర్‌ ఏసీపీ సంజయ్‌కుమార్‌ వెల్లడించారు.

ఇదీ చూడండి: Hyderabad girl rape: సైదాబాద్‌ బాలిక హత్య.. పోలీసుల అదుపులో నిందితుడు

Last Updated : Sep 11, 2021, 1:37 PM IST

ABOUT THE AUTHOR

...view details