తెలంగాణ

telangana

కుటుంబ కలహాలతో బావిలో దూకిన భార్య.. కాపాడేందుకు దిగిన భర్త కూడా..!

By

Published : Dec 18, 2022, 7:59 PM IST

Couple suicide in Sangareddy: కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లాలో తీరని విషాదాన్ని నింపింది. జిల్లాలోని గోవింద్​పూర్​ గ్రామానికి చెందిన వెంకటి, అతని భార్య లక్ష్మీ మధ్య గొడవ జరగగా.. వారు పని చేసే వ్యవసాయ క్షేత్రంలో భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.. ఇది గమనించిన భర్త కాపాడేందుకు దిగి మృత్యువాత పడ్డాడు.

Couple suicide in Sangareddy
Couple suicide in Sangareddy

Couple suicide in Sangareddy: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం గోవింద్‌ పూర్‌లో విషాదం నెలకొంది. భర్తతో గొడవ పడిన భార్య వ్యవసాయ క్షేత్రంలోని బావిలో దూకింది. వెంటనే ఆమెను కాపాడేందుకు దిగిన భర్త వెంకటి కూడా నీటిలో గల్లంతయ్యారు. అక్కడే ఉన్న వెంకటి తల్లి వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

మృతిచెందిన దంపతులకు తొమ్మిదేళ్ల గీతాంజలి, ఏడేళ్ల మల్లీశ్వరితో పాటు నాలుగేళ్ల బాబు ఉన్నాడు. దంపతుల మరణంతో ముగ్గురు చిన్నారులు దిక్కులేని వారయ్యారు. ఆ పిల్లలకు కనీసం వారికి వారి తల్లిదండ్రులు ఏమయ్యారో తెలియక అమాయకపు చూపులు చూస్తుండటం చూసి అక్కడున్న వారు కంటతడి పెట్టారు.

తల్లిదండ్రులు మరణించడంతో ఆనాథలైన పిల్లలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details