ETV Bharat / bharat

గొంతు కోసి భార్యను హత్య చేసిన భర్త.. అనంతరం గుండెపోటుతో మృతి

author img

By

Published : Dec 18, 2022, 5:53 PM IST

భార్యను హతమార్చి గుండెపోటుతో మరణించాడో వ్యక్తి. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లో వెలుగుచూసింది. మరోవైపు, వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళకు ఆమె ప్రియుడు పుత్రశోకాన్ని మిగిల్చాడు. ఆమె 12 ఏళ్ల కుమారుడిని హతమార్చాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్​లో జరిగింది.

Man kills wife
భార్యను హతమార్చిన భర్త

ఛత్తీస్​గఢ్​.. గరియాబాంద్​లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం గుండెపోటుతో నిందితుడు మరణించాడు. శనివారం రాచార్ లాంగ్ ప్రాంతంలో జరిగిందీ ఘటన. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతురాలిని రత్నీబాయిగా గుర్తించారు.

పోలీసులు ఘటనాస్థలికి చేరుకునేసరికే రత్నీబాయి మరణించింది. ఆమె పక్కనే ఆమె భర్త వీరేంద్ర అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. హుటాహుటిన పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. వీరేంద్ర మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అందుకే భార్యను కొడవలితో గొంతు కోసి హతమార్చినట్లు స్థానికులు చెప్పారని పోలీసులు తెలిపారు.

ప్రియురాలి కుమారుడిని..
ఉత్తరాఖండ్.. హరిద్వార్​లోని రూడ్కీలో దారుణం జరిగింది. ఓ వివాహిత.. కాసిఫ్​ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇటీవల ప్రియుడితో ఆమెకు గొడవ జరిగింది. వివాహితపై కోపం పెంచుకున్న కాసిఫ్.. ఆమె 12 ఏళ్ల కుమారుడిని హత్య చేసి.. మృతదేహాన్ని సూట్​కేసులో పెట్టి బయట పడేశాడు. సీసీటీవీలో నిందితుడు సూట్​కేసులో మృతదేహాన్ని తీసుకెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. ఈ దృశ్యాల ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.