తెలంగాణ

telangana

Bhupatipur Farmer Suicide : సీఎం కేసీఆర్​కు లేఖ రాసి రైతు ఆత్మహత్య

By

Published : Dec 10, 2021, 12:20 PM IST

Bhupatipur Farmer Suicide : ''ప్రభుత్వం చెప్పినట్లు సన్నరకం వరి పండిస్తే దిగుబడి తక్కువ వచ్చింది. వచ్చిన పంటకు కనీస మద్దతు ధర లేదు. ఇప్పుడు రబీలో వరి వేయొద్దని చెబుతున్నారు. పుష్కలంగా నీళ్లున్నాయి. నేను కౌలుదారులకు ఏం ఇయ్యాలె. నా తండ్రికి 60 ఏళ్లైనా పింఛను రావడం లేదు. నా కుమారుడు 8 తరగతి చదువుతున్నాడు. అతణ్ని ఇంజినీరింగ్ చదివియ్యాలె.'' అని ముఖ్యమంత్రి కేసీఆర్​కు లేఖ రాసి ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Bhupatipur Farmer Suicide
Bhupatipur Farmer Suicide

Bhupatipur Farmer Suicide: మెదక్ జిల్లా హవేలిఘనపూర్ మండలం బొగుడు భూపతిపూర్​లో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగి కరణం రవికుమార్(40) బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనాస్థలిలో మృతుడు.. ముఖ్యమంత్రి కేసీఆర్​కు రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు.

సీఎం కేసీఆర్​కు లేఖ రాసి రైతు ఆత్మహత్య

Farmer Letter To CM KCR : 'ప్రభుత్వం చెప్పినట్లు సన్నరకం వరి పండిస్తే దిగుబడి తక్కువ వచ్చింది. వచ్చిన పంటకు కనీస మద్దతు ధర లేదు. ఇప్పుడు రబీలో వరి వేయొద్దని చెబుతున్నారు. పుష్కలంగా నీళ్లున్నాయి. నేను కౌలుదారులకు ఏం ఇయ్యాలె. నా తండ్రికి 60 ఏళ్లైనా పింఛను రావడం లేదు. నా కుమారుడు 8 తరగతి చదువుతున్నాడు. తనను ఇంజినీరింగ్ చదివియ్యాలె' అని సీఎం కేసీఆర్​కు రాసిన లేఖలో రవికుమార్ పేర్కొన్నాడు. ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు.

సీఎం కేసీఆర్​కు లేఖ రాసి రైతు ఆత్మహత్య

Farmer Suicide Letter : రవికుమార్​కు 3.5 ఎకరాల భూమి ఉందని.. తన మొదటి కుమార్తె పెళ్లి కోసం 30 గుంటల భూమి అమ్మినట్లు స్థానికులు తెలిపారు. అతడి కుమారుడు సాయికిరణ్ హిమోపోలియా అనే వ్యాధితో బాధపడుతున్నట్లు రూ.18 లక్షలు అప్పు చేసి వైద్యం చేయడం వల్ల రవి అప్పులపాలయ్యాడని చెప్పారు. ఇప్పుడు పంట దిగుబడి లేకపోవడం.. మద్దతు ధర ఇవ్వకపోవడం వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. లేఖ అతడే రాశాడని చేతిరాత ద్వారా ధ్రువీకరించారు.

ABOUT THE AUTHOR

...view details