తెలంగాణ

telangana

ఇరువర్గాల ఘర్షణను అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై దాడి

By

Published : Apr 3, 2021, 12:47 AM IST

సిద్దిపేట జిల్లా కోహెడలో ఉద్రిక్తత నెలకొంది. గొడవను ఆపేందుకు వెళ్లిన బ్లూకోట్స్​ కానిస్టేబుల్స్​పై దాడి జరిగింది. ఈ ఘటనలో కానిస్టేబుల్​ మోహన్​ తీవ్రంగా గాయపడగా.. కరీంనగర్​లోని అపోలో ఆస్పత్రికి తరలించారు.

attack on police at siddipet district
attack on police at siddipet district

సిద్దిపేట జిల్లా కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణను ఆపేందుకు ప్రయత్నించిన బ్లూకోట్ పోలీసులపై దాడి జరిగింది.

కోహెడ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో శుక్రవారం రాత్రి గొడవ జరుగుతోందని డయల్​ 100కు సమాచారం వచ్చింది. నియంత్రించడానికి వెళ్లిన బ్లూకోట్స్​ కానిస్టేబుల్స్​ మోహన్, లక్ష్మణ్​ల పై ఆ గొడవకు కారణమైన నజీమొద్దిన్ దాడి చేశాడు. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ మోహన్ తలకు తీవ్రగాయమైంది.

సమాచారం అందుకున్న కోహెడ ఎస్సై రాజ్​కుమార్.. కానిస్టేబుల్ మోహన్​ను కరీంనగర్​లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన వారిపై హత్యాయత్నం, విధి నిర్వహణకు ఆటంకం కలిగించారంటూ.. ఐపీసీ 307, 332 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

కోహెడలో బ్లూకోట్​ పోలీసులపై దాడి

ఇవీచూడండి:హైదరాబాద్ పాతబస్తీలో పగలు, ప్రతీకారాలు

ABOUT THE AUTHOR

...view details