తెలంగాణ

telangana

Heroine Harassment: ప్రముఖ సినీ నటికి అసభ్యకర సందేశాలు.. ఫొటోలు మార్ఫింగ్​ చేసి..!

By

Published : May 8, 2022, 7:31 AM IST

Heroine Harassment: నగరంలో మహిళలపై నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సినిమా హీరోయిన్లు సైతం వేధింపులకు గురి అవుతున్నారు. తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో పేరున్న ఓ నటి ఫోన్ నంబర్​ సేకరించి వేధింపులకు గురి చేశాడో ఓ ప్రబుద్ధుడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Heroine Harassment
నిందితుడి అరెస్ట్‌

Heroine Harassment: తెలుగు సినీ పరిశ్రమలో పేరున్న నటి ఆమె. స్టార్‌మేకర్స్‌ యాప్‌ ద్వారా ఆమె ఫోన్‌ నంబరు సేకరించాడో ప్రబుద్ధుడు. ఆమెకు అసభ్య పదజాలంతో వాయిస్‌ మేసేజ్‌లు పంపాడు. కొద్దిరోజుల తర్వాత ఫోన్‌ చేసి ఆమె ఫొటోలు తన వద్ద ఉన్నాయని, వాటిని మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో ఉంచుతానంటూ బెదిరించాడు. తాను చెప్పినట్టు నడుచుకోవాలంటూ మరోవేదనకు గురిచేశాడు. వాట్సాప్‌ ద్వారా బాధితురాలు షీటీమ్స్‌కు ఫిర్యాదు చేయటంతో మాదాపూర్‌ షీటీమ్స్‌ ఆ యువకుడిని గుర్తించి రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కేవలం రెండునెలల్లో 319 మంది ఆకతాయిలకు సైబరాబాద్‌ పోలీసుల కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు తెలిపారు.

డెకాయ్‌ ఆపరేషన్స్‌..: సైబరాబాద్‌ షీటీమ్స్‌ డెకాయ్‌ ఆపరేషన్స్‌ ద్వారా మహిళలను వేధిస్తున్న ఆకతాయిలకు ముకుతాడు వేశారు. అధికశాతం బాధితులు లైంగిక వేధింపులకు గురైన వారే ఉన్నారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో వాట్సాప్‌, హాక్‌ ఐ, ఈమెయిల్‌ తదితర మాధ్యమాల ద్వారా బాధితుల నుంచి 355 ఫిర్యాదులు అందినట్టు సైబరాబాద్‌ డీసీపీ (షీ టీమ్స్‌) అనసూయ శనివారం తెలిపారు. అధికంగా వాట్సాప్‌ ద్వారా 269 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వీరిలో ఫోన్‌ వేధింపులు 141 ఉన్నట్టు చెప్పారు. 81 కేసుల్లో 18 క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. 119 మందిని పద్ధతి మార్చుకోమంటూ హెచ్చరించారు. 319 మంది ఆకతాయిలకు కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఇందులో మైనర్లు 98, 19-24 వయస్కులు 112, 25-35 ఏళ్ల వారు 92, 36-50 మధ్య 17 మంది ఉన్నారు. 7 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. 2 నెలల వ్యవధిలో 1003 డెకాయి ఆపరేషన్‌, 834 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వేధింపులపై డయల్‌ 100, వాట్సాప్‌ నంబర్‌ 94906 17444 కు ఫిర్యాదు చేయాలని డీసీపీ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details