తెలంగాణ

telangana

నిజామాబాద్ జిల్లాలో దారుణం.. తండ్రిని, బాబాయిని చంపిన కుమారుడు

By

Published : Aug 12, 2022, 11:58 AM IST

LAND DISPUTES: నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. భూ తగాదాలతో ఓ వ్యక్తి కన్నతండ్రిని, బాబాయిని పారతో కొట్టి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

నిజామాబాద్ జిల్లా
నిజామాబాద్ జిల్లా

LAND DISPUTES: నిజామాబాద్ జిల్లా మోపాల్‌లో దారుణం చోటుచేసుకుంది. భూ తగాదాలతో ఓ వ్యక్తి.. తన తండ్రిని, బాబాయిని పారతో కొట్టి హత్యచేశాడు. భూ తగాదాల విషయమై.. కర్రోళ్ల అబ్బయ్య, అతని సోదరుడు సాయిలు, అబ్బయ్య కుమారుడు సతీష్‌కు మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాత్రి గొడవ పెరగడంతో.. అబ్బయ్య, సాయిలును సతీష్‌ పారతో తలపై కొట్టాడు.

దెబ్బ తీవ్రంగా తగలడంతో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్యకు ప్రధాన కారణం భూ తగాదాలు అని స్థానికులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details