తెలంగాణ

telangana

పొలం చదును చేస్తుండగా ప్రమాదం.. యువకుడు మృతి

By

Published : May 25, 2021, 2:09 PM IST

ఆదిలాబాద్ జిల్లా బేదోడ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్​తో పొలం చదును చేస్తుండగా జరిగిన ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలిస్తున్నారు.

ట్రాక్టర్ ప్రమాదంలో మృతి, బేదోడలో వ్యక్తి మృతి

ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని బేదోడ గ్రామ శివారులోని పొలంలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. అదే మండలానికి చెందిన రాహుల్ ధోలే ట్రాక్టర్​తో పంట చదును చేస్తుండగా ప్రమాదవశాత్తు రోటవేటర్ యంత్రంలో పడి ప్రాణాలు కోల్పోయాడు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో కొనసాగుతున్న రెండో డోస్ వ్యాక్సినేషన్

ABOUT THE AUTHOR

...view details