తెలంగాణ

telangana

మంత్రి సత్యవతి రాఠోడ్​కు సొంత పార్టీ కార్యకర్తల నుంచే నిరసన సెగ..

By

Published : Sep 20, 2022, 7:41 PM IST

Minister Satyavathi rathod gherav by Trs Activists: ములుగు జిల్లాలో మంత్రి సత్యవతి రాఠోడ్​కు నిరసన సెగ తగిలింది. సొంతపార్టీ కార్యకర్తల నుంచే ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా మంత్రి సత్యవతిని అడ్డుకున్నారు. తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పే వరకు కదిలేది లేదని కాన్వాయ్​ ముందు భీష్మించుకుని కూర్చున్నారు.

Minister Satyavathi rathod
Minister Satyavathi rathod

Minister Satyavathi rathod gherav by Trs Activists: ములుగు జిల్లా పర్యటనకు వెళ్లిన మంత్రి సత్యవతి రాఠోడ్​కు సొంతపార్టీ కార్యకర్తల నుంచే నిరసన సెగ ఎదురైంది. అధికార పార్టీ శ్రేణులే మంత్రిని అడ్డుకోవడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మంత్రి గట్టమ్మ దగ్గరకి రాగానే తెరాస ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఆమెను అడ్డుకున్నారు.

వర్షాన్ని కూడా లెక్కచేయకుండా అక్కడకు చేరుకున్న దళితులు కాన్వాయ్​ను ముందుకు వెళ్లకుండా భీష్మించుకుని కూర్చుకున్నారు. ములుగు గడ్డ పైన అడుగు పెట్టొద్దంటూ నినాదాలు చేశారు. జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీష్.. మంత్రి సత్యవతి రాఠోడ్​ కాళ్లు పట్టుకొని మరీ దళితులకు న్యాయం చేయాలని వేడుకున్నారు. దళితబంధు జిల్లాలో అర్హులైన వారికి ఎందుకు ఇస్తలేరని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న దళితులకు దళిత బంధు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌కు వ్యతికేంగా ఉన్నవారికి దళిత బంధు ఇస్తున్నారని వాపోయారు. ఉమ్మడి జిల్లా మంత్రులందరూ కలిసి ములుగు ఎమ్మెల్యేతో సమాధానం పడటం ఏంటీ అని మండిపడ్డారు. మీ రహస్య ఒప్పందాలు ఏమిటో కార్యకర్తలకు వివరించాలని పట్టు పట్టారు.

'మేము ఉద్యమం సమయం నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ వెన్నంటే ఉన్నాం. అప్పటి నుంచి తెరాసలో ఉన్న ఉద్యమకారులు, కార్యకర్తలు ఏజెన్సీ ప్రాంతాలలో నేడు దళితబంధుకు నోచుకోలేని స్థితిలో ఉన్నారు. ఇచ్చిన దళితబంధు యూనిట్లను కేసీఆర్​ను తిట్టిన వాళ్లకు ఇచ్చారు. తెలంగాణలో అందరినీ సమానంగా చూడాలి. అలా ఇవ్వడం చాలా బాధగా ఉన్నాం. తెలంగాణ కోసం మీ వెంట నడిచిన వాళ్లను బతికించండి.' -దుర్గం స్వామి, తెరాస కార్యకర్త

మంత్రి సత్యవతి రాఠోడ్​కు నిరసన సెగ.. అడ్డుకున్న తెరాస కార్యకర్తలు.!

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details