తెలంగాణ

telangana

TOP NEWS: టాప్ న్యూస్@ 9PM

By

Published : Jul 11, 2022, 8:58 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS
TOP NEWS

  • ముసుగేసిన వరుణుడు

Heavy rains in Telangana: రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ముసురుపట్టగా... మరికొన్ని చోట్ల మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు మూడ్రోజులుగా పలుజిల్లాల్లో కురిసిన ఏకధాటి వానలకు... పల్లెలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వరద నీరు భారీగా చేరి... అనేక చోట్ల వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి

  • ఎంతమందికి చెల్లించారో చెప్పండి

కాళేశ్వరం నిర్వాసితుల పరిహారం అంశంపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఎంత మందికి ఎంత పరిహారం చెల్లించారో వివరాలతో సహా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తమకు సరైన విధంగా పరిహారం అందలేదంటూ కాళేశ్వరం నిర్వాసితులు సుప్రీంను ఆశ్రయించారు.

  • 'సీఎం​ను ఏక్​నాథ్​ శిందే భూతం పట్టుకుంది..'

Revanth Reddy Comments: సీఎం కేసీఆర్​పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నాలుగు రోజుల్లో కేసీఆర్ మంత్రివర్గాన్ని రద్దు చేసి ముందస్తుకు రావాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్‌ను ఇప్పుడు ఏక్‌నాథ్‌ శిందే బూతం పట్టుకుందని ఎద్దేవా చేశారు.

  • అధికారంలోకి వచ్చాక ఐదు విప్లవాలు

KTR inaugurated Alpla: తెరాస హయాంలో రాష్ట్రంలో ఐదు విప్లవాలు వచ్చాయని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ ద్వారా పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో ఏర్పాటుచేసిన అల్‌ప్లా మౌల్డ్​ షాప్‌, ఎడ్యుకేషన్‌ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు.

  • దేశంలోనే తొలిసారిగా.

Formula E Racing in Hyderabad: ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్​కు హైదరాబాద్​ సన్నద్ధమవుతోంది. భారతదేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ వేదికగా 2023 ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్​కు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

  • ఈసెట్ వాయిదా.. ఎంసెట్ యథాతథం

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎల్లుండి జరగాల్సిన ఈసెట్ వాయిదా వేశారు.

  • 'ఆయన​ బలం, బలహీనత, భయం..నాకు మాత్రమే తెలుసు..'

Etela rajender Comments: సీఎం కేసీఆర్​పై హుజూరాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్​ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్​ బలం, బలహీనత, భయం అన్ని తనకు మాత్రమే తెలుసన్నారు. కేసీఆర్‌ దుర్మార్గమైన పాలన అంతమొందించే బాధ్యత తనపై ఉందన్నారు.

  • సోనియా గాంధీకి ఈడీ సమన్లు

ED Summons Sonia: కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీకి.. ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది. నేషనల్​ హెరాల్డ్​ కేసులో.. జులై 21న విచారణకు హాజరుకావాలని పేర్కొంది.

  • మళ్లీ షురూ

Amarnath Yatra Resumes: ప్రతికూల వాతావరణం కారణంగా రద్దయిన అమర్‌నాథ్‌ యాత్ర సోమవారం తిరిగి ప్రారంభమైంది. జమ్ములోని భగవతి నగర్‌ యాత్రి నివాస్‌ నుంచి.. యాత్రికులు భారీ బందోబస్తు మధ్య బేస్‌ క్యాంపులకు బయలుదేరారు.

  • వచ్చే ఏడాది మనమే నెం.1.. ఏ విషయంలో అంటే?

వచ్చే ఏడాది నాటికి జనాభా విషయంలో చైనాను భారత్ అధిగమిస్తుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. 2022 నవంబర్​ నాటికి ప్రపంచ జనాభా 8 బిలియన్లకు చేరుకుంటుందని పేర్కొంది. ఈ మేరకు ప్రపంచ జనాభా అంచనా 2022 పేరిట ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల శాఖ నివేదికను ప్రచురించింది.

ABOUT THE AUTHOR

...view details