ETV Bharat / state

KTR inaugurated Alpla: తెరాస అధికారంలోకి వచ్చాక ఐదు విప్లవాలు: కేటీఆర్‌

author img

By

Published : Jul 11, 2022, 5:37 PM IST

KTR inaugurated Alpla: తెరాస హయాంలో రాష్ట్రంలో ఐదు విప్లవాలు వచ్చాయని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ ద్వారా పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో ఏర్పాటుచేసిన అల్‌ప్లా మౌల్డ్​ షాప్‌, ఎడ్యుకేషన్‌ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు.

KTR
కేటీఆర్

KTR inaugurated Alpla: రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలపై, పెట్టుబడిదారులపై ఎలాంటి ఒత్తిడి లేదని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ ద్వారా పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో ఏర్పాటుచేసిన అల్‌ప్లా మౌల్డ్​ షాప్‌, ఎడ్యుకేషన్‌ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలో సమ్మిళిత అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో స్థిర, సామర్ధ్యం ఉన్న ప్రభుత్వం వల్ల జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు అధికంగా ఉందని పేర్కొన్నారు.

రాష్ట్రానికి దిగుమతులు తగ్గించడంతోపాటు యువతకు ఉపాధి కల్పించడమే తన ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెరాస హయాంలో రాష్ట్రంలో సస్య, నీలి, క్షీర, గులాబీ, పసుపు విప్లవాలు అభివృద్ధి దిశగా సాగుతున్నాయన్నారు. దీంతోపాటు రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో 25 లక్షల ఆయిల్‌పామ్‌ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలో స్థిర, సామర్ధ్యం ఉన్న ప్రభుత్వం వల్ల జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు అధికంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు వేధింపులు లేవు. ఎలాంటి దాడులు లేవు. మాతో ఉన్నా.. వేరే ఉన్నా ఎలాంటి ఇబ్బందులు లేవు. ప్రధానంగా నాలుగు అంశాలతో వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నాం. కొత్త పారిశ్రామిక వేత్తలకు టీఎస్​ ఐపాస్​ ద్వారా అనుమతులిస్తున్నాం. తెలంగాణ దేశ సగటు కంటే మన రాష్ట్రం ముందుంది. కాలుష్య రహిత పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం. దిగుమతులను తగ్గించే విధంగా పని చేస్తున్నాం. ఆత్మనిర్భర్ భారత్​ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.- కేటీఆర్, ఐటీశాఖ మంత్రి

తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఐదు విప్లవాలు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. సస్య విప్లవంతో లక్షల ఎకరాల సాగులోకి వచ్చాయన్నారు. దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం మనదేనని వెల్లడించారు. నీలి విప్లవంతో మన దేశ అవసరాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో చేపల ఉత్పత్తి ఉందని పేర్కొన్నారు. క్షీర విప్లవంతో రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెరిగిందని.. రాష్ట్రం ఏర్పడే నాటికి అప్పులతో మూతపడే దశలో ఉన్న విజయ డైరీ.. నేడు ప్రభుత్వానికి డివిడెంట్ ఇచ్చే స్థాయికి ఎదిగిందని తెలిపారు. గులాబీ విప్లవంతో పశుపోషణలో అనుభవం ఉన్న యాదవ, కురుమలను ప్రోత్సాహించడంతో రాష్ట్రంలోని పశు సంపద రెట్టింపు అయ్యిందని వెల్లడించారు. పసుపు విప్లవంతో రాష్ట్రంలో నూనె గింజల ఉత్పత్తి పెరగనుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

తెరాస అధికారంలోకి వచ్చాక ఐదు విప్లవాలు: కేటీఆర్‌

ఇవీ చదవండి: రాష్ట్రంలో 'ముసురు'కున్న వర్షాలు.. జలదిగ్బంధంలోనే పలు ప్రాంతాలు..

కుండపోత వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం.. హెలికాప్టర్లతో సహాయక చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.