తెలంగాణ

telangana

TOP NEWS: టాప్​ న్యూస్ @9 PM

By

Published : Jun 23, 2022, 9:00 PM IST

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

top news in TS
టాప్​న్యూస్

  • న్యాయవాదులను అరెస్టు చేసిన ఎన్‌ఐఏ

రాష్ట్రంలోని పలుచోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) సోదాలు జరిపింది. నర్సింగ్‌ విద్యార్థిని రాధ అదృశ్యం కేసులో విచారణ జరుపుతోన్న ఎన్​ఐఏ అధికారులు.. హైదరాబాద్‌ ఉప్పల్‌తో పాటు మెదక్‌ జిల్లా చేగుంట, మేడిపల్లి పర్వతాపూర్​లో తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేశారు.

  • విశ్వవిద్యాలయాల్లో నియామకాలకు ఉమ్మడి బోర్డు

విశ్వవిద్యాలయాల్లో సిబ్బంది నిమాయకాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీల్లో ఇకపై బోధన, బోధనేతర సిబ్బంది నియామకం ఉమ్మడి బోర్డు ద్వారా జరగనుంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

  • మళ్లీ కరోనా విజృంభణ

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గురువారం 28,865 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 494 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి గురువారం 126 మంది కోలుకున్నారు.

  • మరో 2వేల పడకల ఆస్పత్రి

హైదరాబాద్ నిమ్స్‌ ఆస్పత్రిలో 5 కోట్లతో పీడియాట్రిక్, కార్డియాలజీ యూనిట్‌తో పాటు 200 పడకల ఐసీయూ, వెంటిలేటర్లను, ఇతర సౌకర్యాలను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. నిమ్స్‌కు అనుబంధంగా మరో 2వేల పడకల ఆస్పత్రిని అనుబంధంగా నిర్మించనున్నట్లు చెప్పారు.

  • శిందే తిరుగుబాటు సక్సెస్!

Maharashtra political crisis: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం కీలక దశకు చేరింది. శివసేనకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు శిందే క్యాంపునకు చేరుకున్న నేపథ్యంలో.. తర్వాత ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. మహావికాస్ అఘాడీ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమేనని శివసేన చెబుతుండగా.. ప్రభుత్వం కూలిపోతే విపక్షంలో కూర్చుంటామని ఎన్సీపీ స్పష్టం చేసింది.

  • మోదీతో రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము భేటీ

Droupadi Murmu news: అధికార ఎన్డీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము శుక్రవారం నామపత్రాలు దాఖలు చేయనున్నారు. ముర్ము నామినేషన్​పై మోదీ, అమిత్ షా, రాజ్​నాథ్, నడ్డా, ఉత్తర్​ప్రదేశ్, ఉత్తరాఖండ్ సీఎంలు సంతకాలు చేయనున్నారు. దిల్లీకి చేరుకున్న ముర్ము.. ఉపరాష్ట్రపతి, ప్రధానిని కలిశారు.

  • పన్నీర్​సెల్వంకు ఘోర పరాభవం

తమిళనాడులోని చెన్నైలో అన్నాడీఎంకే సమన్వయకర్త​ పన్నీర్​ సెల్వంకు ఘోర పరాభవం ఎదురైంది. ఆ పార్టీ అధికార పగ్గాలపై గురువారం జరిగిన కీలక సమావేశంలో తన మద్దతుదారులతో పన్నీర్​సెల్వం సభ నుంచి వాకౌట్​ చేశారు. అదే సమయంలో ఆయనకు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నినాదాలు చేస్తూ కొందరు నేతలు వాటర్​ బాటిల్స్​ విసిరారు. ఆయన కారు గాలి కూడా తీసేశారు.

  • భార్యకు ముద్దుపెట్టాడని భర్తను కొట్టారు

భార్యకు ముద్దుపెట్టాడని ఓ భర్తను అసభ్య పదజాలంతో తిడుతూ చేయి చేసుకున్నారు కొందరు వ్యక్తులు. ఈ సంఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని అయెధ్యలో జరిగింది.

  • పవన్​ చేతుల మీదుగా విశ్వక్​ మూవీ లాంచ్

Viswak Sen Arjun movie: యాక్షన్​ కింగ్​ అర్జున్​ దర్శకత్వంలో హీరో విశ్వక్​సేన్​ హీరోగా ఓ సినిమా ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ చిత్రం ప్రారంభోత్సవ వేడుకను జరుపుకుంది. ఈ కార్యక్రమానికి పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​, 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు, సీనియర్​ నటుడు ప్రకాశ్​రాజ్​ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ​

  • రోహిత్ శర్మ @15 ఇయర్స్​

rohit sharma news: అంతర్జాతీయ క్రికెట్​లో ప్రవేశించి 15 ఏళ్లు పూర్తైన సందర్భంగా అభిమానులకు లేఖను విడుదల చేశారు కెప్టెన్​ రోహిత్​ శర్మ. ఈ ప్రయాణంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ జర్నీని తన జీవితమంతా గుర్తుంచుకుంటానన్నారు.

ABOUT THE AUTHOR

...view details