తెలంగాణ

telangana

Top news: ప్రధాన వార్తలు @ 9PM

By

Published : Jan 3, 2022, 9:00 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news in telangana at 9 pm
ప్రధాన వార్తలు @ 9PM

  • బండి సంజయ్‌కు రిమాండ్

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్​కి కరీంనగర్​ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సంజయ్‌ సహా కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్‌, పుప్పాల రఘు, కాచు రవి, మర్రి సతీశ్‌కు ఈనెల 17 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది

  • పరారీలో ఎమ్మెల్యే కుమారుడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ ఘటనలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేందర్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

  • ' టీకాల మేళవింపుతో మెరుగైన రక్షణ'

AIG Study On Mixed Vaccines: టీకాల మేళవింపుతో కొవిడ్ నుంచి మెరుగైన రక్షణ కల్పిస్తుందని ఏఐజీ ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. టీకాల మేళవింపు వల్ల ప్రయోజనాలు, ఏమేరకు సురక్షితంపై ఏఐజీ అధ్యయనం చేసినట్లు వెల్లడించారు.

  • రాష్ట్రానికి 'వన్​ మోటో'

One moto India: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు బ్రిటన్‌ సంస్థ వన్ మోటో ముందుకొచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. జహీరాబాద్‌లో రూ.250 కోట్లతో తయారీ యూనిట్‌ను ఏడాదిలోగా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.

  • మోదీపై గవర్నర్​​ ఫైర్​!

Satya Pal Malik Attacks PM Modi: ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పడేసే సంచలన వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు మేఘాలయ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతుల ఆందోళనలపై చర్చించిన సమావేశంలో ప్రధాని చాలా అహంకారిగా ప్రవర్తించారని చెప్పారు.

  • టీకా కేంద్రాల్లో పిల్లల సందడి..

దేశంలో 15-18 ఏళ్ల వయసు కలిగిన పిల్లలకు కొవిడ్​-19 వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాల ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పిల్లలకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించాయి

  • ' థర్డ్ వేవ్​కు ముగింపు అప్పుడే.'

IIT Kanpur Professor On Third Wave: భారత్​లో 2022, ఏప్రిల్ వరకు కరోనా థర్డ్​వేవ్​ వ్యాప్తి ఉంటుందని ఐఐటీ కాన్పుర్​ ప్రొఫెసర్ మహీంద్ర అగర్వాల్ తెలిపారు. ఎన్నికల ర్యాలీలు సూపర్ స్ప్రెడర్​లుగా మారతాయని హెచ్చరించారు.

  • భారీగా తగ్గిన బంగారం ధర

Gold Price Today: దేశంలో బంగారం ధర రూ.1,160 మేర దిగొచ్చింది. వెండి ధర కూడా రూ.300 తగ్గింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

  • 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్​కు అన్ని కోట్లా?

RRR movie: 'ఆర్ఆర్ఆర్' చిత్రం మళ్లీ వాయిదా పడేసరికి దేశవ్యాప్తంగా సినీ అభిమానులందరూ నిరుత్సాహపడ్డారు. అయితే సినిమా ప్రమోషన్స్​ కోసం చేసిన ఖర్చు గురించి ఆసక్తికర సమాచారం బయటకొచ్చింది. ఆ మొత్తం ఎంతంటే?

  • భారత్ ఆలౌట్

IND vs SA Test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్​లో 202 పరుగులకు ఆలౌటైంది టీమ్ఇండియా. రాహుల్ (50) అర్ధసెంచరీతో రాణించగా.. అశ్విన్ (46) ఆకట్టుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details