ETV Bharat / bharat

'ప్రధాని అహంకారి'- మోదీపై గవర్నర్​ మాలిక్​ ఫైర్​!

author img

By

Published : Jan 3, 2022, 2:17 PM IST

Satya Pal Malik Attacks PM Modi: ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పడేసే సంచలన వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు మేఘాలయ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతుల ఆందోళనలపై చర్చించిన సమావేశంలో ప్రధాని చాలా అహంకారిగా ప్రవర్తించారని చెప్పారు.

Satya Pal Malik Attacks PM Modi
సత్యపాల్‌ మాలిక్‌

Satya Pal Malik Attacks PM Modi: అధికారంలో ఉన్న పార్టీకి చెందిన మేఘాలయ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌.. నిత్యం కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ.. వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల ఆందోళనలపై చర్చించిన సమావేశంలో ప్రధాని చాలా అహంకారిగా ప్రవర్తించారని అన్నారు. తాను మోదీతో వాగ్వాదానికి దిగినట్లు చెప్పుకొచ్చారు. హరియాణాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ఈ మేరకు మాట్లాడారు. ఆ వీడియోను ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది.

రైతుల సమస్యలపై చర్చించినప్పుడు ఐదు నిమిషాల పాటు ప్రధానితో వాగ్వాదం జరిగింది. 500 మంది రైతులు మరణించారని ప్రశ్నించినప్పుడు.. మోదీ చాలా అహంకారిగా స్పందించారు. 'నా కోసం చనిపోయారా?' అని అన్నారు. మీరు ప్రధానిగా ఉన్నప్పుడు చనిపోయారని నేను చెప్పాను.

-సత్యపాల్ మాలిక్​, మేఘాలయ గవర్నర్‌

పోరాటం ఆగిందనుకుంటే పొరపాటే:

satya pal malik news: సాగు చట్టాల పోరాటంలో రైతులపై నమోదైన కేసులను రద్దు చేసే విషయంలో కేంద్రం నిజాయితీగా వ్యవహరించాలని మాలిక్​ కోరారు. ఎంఎస్​పీకి చట్టబద్ధమైన ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. 'రైతు పోరాటం ఆగిపోయిందని ప్రభుత్వం అనుకుంటే పొరపాటే. తాత్కాలికంగా మాత్రమే ఆగిపోయింది. ఏదైనా అన్యాయం జరిగితే మళ్లీ నేను మొదలుపెడతాను' అని మాలిక్​ హెచ్చరించారు.

గవర్నర్‌గా బదిలీలు..

Satya Pal Malik Transfers: సత్యపాల్‌ గవర్నర్‌ పదవీ నిర్వహణ ఇప్పటి వరకూ భిన్నంగా నడుస్తూ వచ్చింది. ఆయన ఈ పదవి చేపట్టినప్పటి నుంచి నాలుగు రాష్ట్రాలకు బదిలీ అయ్యారు. ఒడిశా గవర్నర్‌గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. 2017లో ఆయన్ను బిహార్‌ గవర్నర్‌గా నియమించే నాటికి భాజపా కిసాన్‌ మోర్చా ఇన్‌-ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అప్పటికే భాజపా-జేడీయూ సర్కారుపై బిహార్‌లోని అనాథాశ్రమాల్లో సెక్స్‌ కుంభకోణం ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటన వార్తా కథనాలపై తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన బిహార్‌ ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి సమస్య పరిష్కారానికి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఆయన్ను 2018 ఆగస్టులో కశ్మీర్‌ గవర్నర్‌గా బదిలీ చేశారు. కశ్మీర్ స్వయం ప్రతిపత్తి విషయంలో కేంద్రం మాలిక్‌ను మేఘాలయకు పంపింది.

ఇదీ చదవండి:'యుద్ధంతో కాదు.. ప్రేమతో స్వాధీనం చేసుకుందాం'

'ప్రజల డిమాండ్​కు తలవంచితే అవమానానికి గురైనట్లు కాదు'

మాలిక్‌కు అంత కోపమెందుకొచ్చింది..?

'కుక్క చనిపోయినా విచారం.. రైతుల మరణాలపై మాత్రం దిల్లీ పెద్దల మౌనం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.