ETV Bharat / sports

సత్తాచాటిన సఫారీ పేసర్లు.. తొలి ఇన్నింగ్స్​లో భారత్ 202 ఆలౌట్

author img

By

Published : Jan 3, 2022, 7:36 PM IST

IND vs SA Test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్​లో 202 పరుగులకు ఆలౌటైంది టీమ్ఇండియా. రాహుల్ (50) అర్ధసెంచరీతో రాణించగా.. అశ్విన్ (46) ఆకట్టుకున్నాడు.

IND vs SA Test, IND vs SA Test live updates, భారత్ దక్షిణాఫ్రికా రెండో టెస్టు, భారత్ దక్షిణాఫ్రికా రెండో టెస్టు లైవ్
IND vs SA Test

IND vs SA Test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా బ్యాటర్లు తడబడ్డారు. కోహ్లీ గైర్జాజరుతో ఈ మ్యాచ్​కు కెప్టెన్​గా వ్యవహరిస్తున్న కేఎల్ రాహుల్ (50) అర్ధసెంచరీతో రాణించగా.. స్పిన్నర్ అశ్విన్ (46) ఆకట్టుకున్నాడు. దీంతో తొలి ఇన్నింగ్స్​లో 202 పరుగులకు పరిమితమైంది భారత జట్టు.

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్​కు ఓపెనర్లు మయాంక్ (26), రాహుల్ (50) శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్​కు 36 పరుగులు జోడించారు. అనంతరం మయాంక్​తో పాటు పుజారా (3), రహానే (0) వెంటవెంటనే పెవిలియన్ చేరారు. దీంతో 49 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది టీమ్ఇండియా. అనంతరం విహారితో కలిసి ఇన్నింగ్స్​ను గాడినపెట్టాడు రాహుల్. మంచి టచ్​లో కనిపించిన విహారి (20)ని వాండర్ డస్సేన్ అద్భుత క్యాచ్​తో పెవిలియన్ పంపాడు. అనంతరం పంత్ (17) ఓపికగా ఆడినా భారీ స్కోర్ సాధించలేకపోయాడు. ఈ క్రమంలోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న రాహుల్.. ఆ పరుగుల వద్దే ఔట్ కావడం వల్ల భారత్ చిక్కుల్లో పడింది. కానీ స్పిన్నర్ అశ్విన్ గట్టి పట్టుదలతో పోరాడాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా బంతికొక పరుగు రాబడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే 46 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఇతడిని ఔట్ చేశాడు జాన్సెస్. చివర్లో బుమ్రా (14) మెరవడం వల్ల 202 పరుగులకు పరిమితమైంది భారత్.

ఇవీ చూడండి: రాహుల్​కు అంపైర్ వార్నింగ్.. ఏం జరిగిందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.