తెలంగాణ

telangana

కొడాలి నాని వ్యాఖ్యలపై తెదేపా ఆగ్రహం.. గుడివాడలో ఉద్రిక్తత

By

Published : Sep 11, 2022, 3:49 PM IST

Updated : Sep 11, 2022, 4:00 PM IST

Tension At Gudivada Police Station: ఏపీలో గుడివాడ వన్‌టౌన్ పోలీస్​స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొడాలి నానిపై ఫిర్యాదు చేసేందుకు తెదేపా నేతలు ప్రయత్నించగా పార్టీ కార్యాలయం వద్ద నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తెదేపా నాయకులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

తెదేపా
తెదేపా

Tension At Gudivada Police Station: ఆంధ్రప్రదేశ్​లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు లోకేశ్‌పై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కృష్ణాజిల్లా గుడివాడ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్నతెదేపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గుడివాడ వన్‌టౌన్ పోలీస్​స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులను తోసుకుంటూ తెదేపా నాయకులు స్టేషన్‌కు వచ్చారు.

ఈ క్రమంలో తెదేపా శ్రేణుల తోపులాటలో పోలీసులు కిందపడ్డారు. తెదేపా నాయకులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, బుద్ధా వెంకన్న, వర్ల రామయ్య గుడివాడ వెళ్తుండగా మార్గం మధ్యలో పోలీసులు వారిని నిలువరించారు. కంకిపాడు టోల్ గేట్ వద్ద ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వాహనాన్ని ఆపి గుడివాడ వెళ్లేందుకు అనుమతి లేదన్నారు. గద్దె రామ్మోహన్​ను ఉంగుటూరు స్టేషనుకు తరలించారు. మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యను పమిడిముక్కల స్టేషన్‌కు తీసుకెళ్లారు. పామర్రులోను తెలుగుదేశం నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త నెలకొంది.

కొడాలి నాని వ్యాఖ్యలపై తెదేపా ఆగ్రహం.. గుడివాడలో ఉద్రిక్తత
Last Updated : Sep 11, 2022, 4:00 PM IST

ABOUT THE AUTHOR

...view details