తెలంగాణ

telangana

Opposition Meeting: గాంధీభవన్​లో రేవంత్ అధ్యక్షతన ప్రతిపక్ష పార్టీల సమావేశం

By

Published : Sep 19, 2021, 12:20 PM IST

Updated : Sep 19, 2021, 1:28 PM IST

telangana-opposition-parties-meeting-in-gandhi-bhavan
telangana-opposition-parties-meeting-in-gandhi-bhavan

గాంధీభవన్​లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ప్రతిపక్ష పార్టీలు భేటీ అయ్యాయి. పోడు భూముల సమస్య చాలా తీవ్రంగా ఉందని దాదాపు 20నియోజకవర్గాల్లో ఈ సమస్య ఉన్నట్లు సమావేశంలో చర్చకు వచ్చింది. పోడు భూముల సమస్య పరిష్కారానికి దీర్ఘాకాలిక పోరాటం చేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

గాంధీభవన్​లో రేవంత్ అధ్యక్షతన ప్రతిపక్ష పార్టీల సమావేశం

హైదరాబాద్ గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రతిపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. పోడు భూముల సమస్య పరిష్కారం అయ్యే వరకు క్షేత్రస్థాయిలో ఉద్యమాలు నిర్మించాల్సి ఉందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రతిపక్షపార్టీల సమావేశంలో పేర్కొన్నారు. గాంధీభవన్‌లో వివిధ పార్టీలకు చెందిన నాయకులతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీగౌడ్, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, ప్రోఫెసర్ విశ్వేశ్వర్ రావు, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి పీసీసీ సినీయర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.

పోడు భూముల సమస్య చాలా తీవ్రంగా ఉందని దాదాపు 20నియోజకవర్గాల్లో ఈ సమస్య ఉన్నట్లు సమావేశంలో చర్చకు వచ్చింది. పోడు భూముల సమస్య పరిష్కారానికి దీర్ఘాకాలిక పోరాటం చేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కొత్తగా తీసుకువచ్చిన ధరణి వెబ్‌సైట్‌లో దాదాపు 25 లక్షల ఏకరాలు భూమిని నిషేదిత జాబితాలో వేశారని ఆరోపించారు. ఇందువల్ల సామాన్య పేద రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిషేదిత జాబితాలో భూములు ఉండడంతో ప్రభుత్వ పథకాలతోపాటు బ్యాంకు రుణాలు కూడా తీసుకోలేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపడంలేదని ఆరోపించారు. ఈ నిషేదిత జాబితాలో భూములను తొలగించేందుకు రాష్ట్రస్థాయిలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:

Last Updated :Sep 19, 2021, 1:28 PM IST

ABOUT THE AUTHOR

...view details