తెలంగాణ

telangana

స్థానిక ప్రజాప్రతినిధుల వేతనాల పెంపు నిర్ణయం ఉపసంహరణ

By

Published : Nov 19, 2021, 7:14 PM IST

Updated : Nov 19, 2021, 8:43 PM IST

TELANGANA GOVERNMENT
TELANGANA GOVERNMENT

19:11 November 19

స్థానిక ప్రజాప్రతినిధుల వేతనాల పెంపు నిర్ణయం ఉపసంహరణ

పట్టణ ప్రాంత స్థానిక ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాల (urban local representatives honorarium) పెంపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకొంది. మేయర్లు, ఛైర్​పర్సన్లు, డిప్యూటీ మేయర్లు, డిప్యూటీ ఛైర్​పర్సన్లు, కార్పొరేషన్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యుల గౌరవ వేతనాలు 30 శాతం పెంచుతూ పురపాలకశాఖ నిన్న(నవంబర్​ 18) ఉత్తర్వులు జారీచేసింది. జులై నెల నుంచి (urban local representatives honorarium ) గౌరవ వేతనాలు పెంచుతున్నట్లు అందులో పేర్కొన్నారు. తాజాగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకొంటూ ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది.

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి నేపథ్యంలో నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు సమాచారం. అయితే గౌరవ వేతనాల పెంచేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది. 

స్థానిక సంస్థల కోటాలో..

స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు (mlc election code) నోటిఫికేషన్ విడుదల కాగా.. తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 16న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకాగా.. 23 వరకు నామపత్రాల స్వీకరిస్తారు. ఈనెల 24న ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 26 వరకు గడువును నిర్ణయించారు. డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించగా... డిసెంబరు 14న ఓట్లను లెక్కిస్తారు.

తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండేసి స్థానాలు ఉండగా... ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఒక్కో స్థానం ఉంది. మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానం ఖాళీగా ఉంది. స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన పురాణం సతీష్ కుమార్, భానుప్రసాదరావు, నారదాసు లక్ష్మణరావు, భూపాల్ రెడ్డి, సుంకరి రాజు, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, కల్వకుంట్ల కవిత పదవీకాలం జనవరి నాలుగో తేదీతో పూర్తి కానుంది.

తొమ్మిది ఉమ్మడి జిల్లాల నుంచి...

హైదరాబాద్ మినహా మిగతా తొమ్మిది ఉమ్మడి జిల్లాల నుంచి వీరు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల నుంచి రెండు చొప్పున స్థానాలున్నాయి. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల నుంచి ఒక్కో స్థానం చొప్పున ఉన్నాయి. ఈ స్థానాల నుంచి జనవరి నాలుగో తేదీలోగా కొత్త వారిని ఎమ్మెల్సీలుగా ఎన్నుకోవాల్సి ఉంది. 

ఇదీచూడండి:honorarium: మేయర్‌, డిప్యూటీ మేయర్లు, ఛైర్‌పర్సన్ల గౌరవ వేతనాలు పెంపు

Last Updated : Nov 19, 2021, 8:43 PM IST

ABOUT THE AUTHOR

...view details