తెలంగాణ

telangana

CM KCR Delhi Tour: హస్తిన పర్యటనలో సీఎం కేసీఆర్

By

Published : Feb 28, 2022, 6:56 PM IST

Updated : Feb 28, 2022, 9:09 PM IST

CM KCR Delhi Tour
CM KCR Delhi Tour

18:53 February 28

CM KCR Delhi Tour: హస్తిన పర్యటనలో సీఎం కేసీఆర్

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ పర్యటన ప్రారంభమైంది. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయన హస్తిన చేరుకున్నారు. మూడ్రోజులపాటు ఆయన దిల్లీలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.

దిల్లీ సీఎంతో కేసీఆర్ భేటీ..!

రేపు ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్.. దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌తో సమావేశమవ్వనున్నట్లు సమాచారం. ఈ భేటీ తర్వాత దిల్లీ ఎయిమ్స్‌లో వైద్యపరీక్షలు చేయించుకోనున్నట్లు తెలుస్తోంది.

దిల్లీ యాత్రపై సర్వత్రా ఆసక్తి..

జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించేందుకు పక్కా ప్లాన్​ చేస్తున్న కేసీఆర్​.. దిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జాతీయ స్థాయిలో యాక్టివ్​ రోల్​ ప్లే చేసేందుకు కొత్త టీంను రెడీ చేస్తున్న కేసీఆర్ ఇప్పటికే.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను కలిశారు. సినీనటుడు, రాజకీయ నేత ప్రకాశ్ రాజ్‌ను కలిసి భాజపాకు వ్యతిరేకంగా ఆయన మద్దతు కూడా కూడగట్టారు. ఇంకా అనేక ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరుపుతామని చెప్పడంతో.. ఇప్పుడు దిల్లీ సీఎంతో కేసీఆర్ భేటీ చర్చనీయాంశమైంది.

కేంద్ర మంత్రులను కలవనున్న కేసీఆర్..

మూడ్రోజుల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశముంది. విభజన హామీలు-సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రులతో కేసీఆర్ భేటీ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రితో సీఎం కేసీఆర్ భేటీపై స్పష్టత రావాల్సి ఉంది.

Last Updated : Feb 28, 2022, 9:09 PM IST

ABOUT THE AUTHOR

...view details