తెలంగాణ

telangana

ఆ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో.. ఏపీ ప్రభుత్వంపై సుప్రీం సీరియస్‌

By

Published : Sep 26, 2022, 2:56 PM IST

Updated : Sep 26, 2022, 3:22 PM IST

supremecourt
supremecourt

14:51 September 26

ఎన్‌జీటీ బెంచ్‌ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసిన ఏపీ ప్రభుత్వం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన నష్టంపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్‌ తగిలింది. పర్యావరణ నష్టానికి ఆంధ్రప్రదేశ్‌ ఎందుకు బాధ్యత వహించదని సర్వోన్నత న్యాయస్థానం నిలదీసింది. లాయర్లకు ఫీజు చెల్లింపులో ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ పర్యావరణ రక్షణపై కనిపించడం లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. పోలవరం నిర్మాణంలో పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారంటూ ఎన్‌జీటీ ప్రిన్సిపల్‌ బెంచ్‌ ప్రభుత్వానికి రూ.120 కోట్లు జరిమానా విధించిన విషయం తెలిసిందే. అయితే, ఎన్‌జీటీ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఇవాళ విచారణ చేపట్టిన జస్టిస్‌ రస్తోగి, జస్టిస్‌ రవికుమార్‌ ధర్మాసనం ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేసింది. కేసులో లాయర్లకు ఎంత చెల్లించారో తెలుసుకునేందుకు నోటీసు ఇస్తామని పేర్కొంది. ఒక్క కేసుకు ఎందరు సీనియర్ లాయర్లను ఎంగేజ్ చేస్తారని కోర్టు ప్రశ్నించింది. ఎన్‌జీటీ తీర్పులపై దాఖలైన అన్ని అప్పీళ్లను ఒకేసారి విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. పోలవరం, పురుషోత్తపట్నం, పులిచింతలపై ఇచ్చిన తీర్పులపై విచారిస్తామని స్పష్టం చేసింది.

ఇవీ చదవండి:

Last Updated : Sep 26, 2022, 3:22 PM IST

ABOUT THE AUTHOR

...view details