తెలంగాణ

telangana

పుస్తకాల ముద్రణకూ డబ్బుల్లేవ్.. పిల్లల పరిస్థితేంటి..?

By

Published : Jun 27, 2022, 12:29 PM IST

ఏపీలో ఇంటర్మీడియట్‌ ఉచిత పాఠ్య పుస్తకాలకు నిధుల కొరత ఏర్పడింది. ఇప్పటికీ ముద్రణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తితిదే పుస్తక ప్రసాదం కింద పాఠ్య పుస్తకాల ముద్రణకు సాయం చేయాలని ప్రతిపాదన పంపగా.. దీనిపై ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. కాగా.. పుస్తకాల ముద్రణకు సుమారు రూ.18 కోట్లు అవసరముంది.

పుస్తకాల ముద్రణకూ డబ్బుల్లేవ్.. పిల్లల పరిస్థితేంటి..?
పుస్తకాల ముద్రణకూ డబ్బుల్లేవ్.. పిల్లల పరిస్థితేంటి..?

ఆంధ్రప్రదేశ్​లో ఇంటర్మీడియట్‌ ఉచిత పాఠ్య పుస్తకాలకు నిధుల కొరత ఏర్పడింది. ఫలితంగా ఇప్పటికీ ముద్రణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం పుస్తక ప్రసాదం కింద పాఠ్యపుస్తకాల ముద్రణకు సహాయం చేయాలని ప్రతిపాదన పంపారు. కానీ ఇంతవరకు దీనిపై తితిదే ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. జూనియర్‌ కళాశాలలు జులై ఒకటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి.

రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ రెండేళ్లకు కలిపి సుమారు 1.62 లక్షల మంది విద్యార్థులు ఉంటారు. వీరికి ఉచిత పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉంటుంది. మొత్తం 44 రకాల టైటిళ్లను ముద్రించాల్సి ఉంది. ఇందుకు సుమారు రూ.18 కోట్ల వరకు వ్యయమవుతుంది. ఇంటర్‌ విద్యామండలిలో నిధులు ఉండగా.. వీటిల్లో రూ.80 కోట్లను ‘నాడు-నేడు’కు మళ్లించారు. మరో సుమారు రూ.వంద కోట్లను రాష్ట్ర ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లో డిపాజిట్‌ చేయించారు. దీంతో మండలి వద్ద పూర్తి స్థాయిలో నిధులు లేవు. పాఠ్య పుస్తకాల ముద్రణకు ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సి ఉండగా.. ఇవ్వడం లేదు.

కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ముద్రణ సంస్థల నుంచి కొనుగోలు చేస్తుండగా.. ఆదర్శ పాఠశాలల్లో చదివే ఇంటర్‌ విద్యార్థులకు గతేడాది ఉచిత పుస్తకాలు అందించలేదు. దీంతో బహిరంగ మార్కెట్‌లో కొనుక్కున్నారు. ఈ ఏడాది ఇంటర్‌ విద్యాశాఖకు ఇండెంట్‌ పెట్టారు. కొత్తగా 188 కళాశాలలను ఏర్పాటు చేస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. వీటిల్లో చేరే వారికి ఉచిత పాఠ్య పుస్తకాలు అందించాలంటే ముద్రణ చేయాలి. బహిరంగ మార్కెట్‌లో అమ్మే పుస్తకాల ముద్రణను మాత్రం తెలుగు అకాడమీకి ఇచ్చారు.

ఇవీ చూడండి :'ఆ​ ఎమ్మెల్యేలు రూ.50 కోట్లకు అమ్ముడుపోయారు.. మొత్తం స్క్రిప్ట్​ భాజపాదే'

తల్లి కాబోతున్న ఆలియా భట్​.. ఇన్​స్టాలో పోస్ట్​

ABOUT THE AUTHOR

...view details