తెలంగాణ

telangana

మునుగోడు వాసులకు దుబ్బాక, హుజూరాబాద్​ ప్రజలు విజ్ఞప్తి.. ఏంటంటే?

By

Published : Oct 15, 2022, 1:56 PM IST

Posters on the walls in the munugode: మొన్న నల్గొండ జిల్లా చండూరులో భాజపా అభ్యర్థి రాజగోపాల్​రెడ్డికి వ్యతిరేకంగా కాంట్రాక్ట్​ పే పోస్టర్​లు.. వెలిశాయి. అయితే ఈ పోస్టర్లు మళ్లీ కలకలం రేపుతున్నాయి. అసలు మునుగోడులో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రాజకీయ రణరంగంగా ఈ ఉపఎన్నికలు నిలిచినట్లుగా ఉన్నాయి.

posters
పోస్టర్​లు

Posters on the walls in the munugode: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల వేడి తీవ్ర స్థాయికి చేరుతోంది. నేతలు ఒకరిపై మరొకరు విమర్శలకు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. మొన్ననే చండూరులో కాంట్రాక్ట్​ పే పేరుతో వెలసిన పోస్టర్​లు.. నేడు కూడా అదే చండూర్ పట్టణంలో రాజగోపాల్​రెడ్డికి వ్యతిరేకంగా 18 వేల కోట్ల కాంట్రాక్టు.. నేడే విడుదల.. దర్శకత్వం అమిత్ షా.. అనే పోస్టర్లు వెలిశాయి.

అదేవిధంగా చౌటుప్పల్ పట్టణంలో తెరాసకు వ్యతిరేకంగా దుబ్బాక, హుజూరాబాద్ ప్రజలు ''మేమే మోసం పోయాం అని మునుగోడు ప్రజలు మీరు మోస పోవద్దు'' అని చౌటుప్పల్ పురపాలిక కార్యాలయం ప్రధాన కూడలి వద్ద పోస్టర్లు వెలిశాయి. ఈ విధంగా నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయిన తరవాత గోడలపై పోస్టర్​లు ప్రత్యక్షమవడం కలకలం రేపింది.

మునుగోడు ప్రజలారా మేము మోస పోయాం మీరు మోసపోకండి" అంటూ హుజురాబాద్, దుబ్బాక ప్రజలం అంటూ తెల్లవారు జామున పోస్టర్లు అతికించారు. ఎన్నికల తేదీ దగ్గరపడడంతో తెరాస నాయకులు దెబ్బకొట్టడానికి ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ భాజపా కార్యకర్తలు వాపోతున్నారు. ఇలాంటి తప్పుడు పనులు చేయవద్దని హెచ్చరించారు. ఇప్పటికే నారాయణపురం మండలంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు భాజపా తరపున ప్రచారం చేస్తుండగా ఇవాళ చౌటుప్పల్ మండలంలో ఈటెల రాజేందర్ ప్రచారం ఉన్న నేపథ్యంలో ఇలాంటి పోస్టర్లు అతికించి భాజపాను మానసికంగా దెబ్బ కొట్టాలని తెరాస వారు చూస్తున్నారని భాజపా నాయకులు మండిపడ్డారు.

పోస్టర్​లు

నామినేషన్​ల ప్రక్రియ పూర్తైన తరువాత అన్ని పార్టీలు తమ తమ వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడ్డాయి. అదేవిధంగా పార్టీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. ఎన్నిక ప్రచారం అటుంచితే.. ఎప్పుడు ఏవిధమైన పరిస్థితి ఉంటుందో చెప్పడం కష్టంగా మారుతోంది. ప్రచార హడావిడిలో అన్ని పార్టీ నాయకులు ఉన్నారు. విమర్శలతో పాటు నియోజకవర్గంలో పోస్టర్ల కలకలం సృష్టిస్తున్నాయి. మొన్న భాజపా అభ్యర్థి రాజగోపాలరెడ్డిపై కాంట్రాక్ట్​ పే తరహాలో పోస్టర్​లు, అదే రోజు కాంగ్రెస్​ పార్టీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details