తెలంగాణ

telangana

lokesh arrest: గుంటూరులో నారా లోకేశ్ అరెస్ట్

By

Published : Aug 16, 2021, 5:12 PM IST

ఏపీలోని గుంటూరులో హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య కుటుంబసభ్యులను తెదేపా నేతలు నారా లోకేశ్, ప్రత్తిపాటి, ఆనంద్‌బాబు పరామర్శించారు. లోకేశ్ పర్యటనపై వైకాపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధికే వచ్చారని ఆరోపించారు. దీంతో పరమయ్యగుంటలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం నారా లోకేశ్​ను పోలీసులు అరెస్టు చేసి.. ప్రత్తిపాడు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ప్రత్తిపాటి, ఆనంద్‌బాబు, ధూళిపాళ్లను వేర్వేరు పీఎస్‌లకు తరలించారు.

lokesh arrest: గుంటూరులో నారా లోకేశ్ అరెస్ట్
lokesh arrest: గుంటూరులో నారా లోకేశ్ అరెస్ట్

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరులో హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులను తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, ప్రత్తిపాటి, ఆనంద్‌బాబు పరామర్శించారు. గుంటూరు నగరంలోని రమ్య ఇంటికి వెళ్లిన లోకేశ్‌ వారికి ధైర్యం చెప్పారు. లోకేశ్‌ను చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. రమ్య కుటుంబసభ్యులను పరామర్శించిన తర్వాత మాట్లాడిన లోకేశ్‌.. ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇంట్లోని మహిళలకే ముఖ్యమంత్రి రక్షణ కల్పించలేని పరిస్థితుల్లో ఉన్నారని విమర్శించారు.

lokesh arrest: గుంటూరులో నారా లోకేశ్ అరెస్ట్

తెదేపా-వైకాపా శ్రేణుల తోపులాట

మరోవైపు కేవలం రాజకీయ లబ్ధికే లోకేశ్‌ వచ్చారంటూ వైకాపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో పరమయ్యగుంటలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని నారా లోకేశ్​ను అరెస్టు చేసి ప్రత్తిపాడు పోలీస్​స్టేషన్‌కు తరలించారు. ప్రత్తిపాటి, ఆనంద్‌బాబు, ధూళిపాళ్లను వేర్వేరు పీఎస్‌లకు తరలించారు.

తెదేపా శ్రేణుల ఆందోళన..

నారా లోకేశ్​ను పోలీసులు అరెస్టు చేసి ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్​కు తరలించారు. లోకేశ్ అరెస్టును ఖండిస్తూ ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ వద్ద తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. లోకేశ్​ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్తిపాడు పీఎస్​లో ఉన్న లోకేశ్​ను తెదేపా నేత కొల్లు రవీంద్ర పరామర్శించారు.

ఇదీ చదవండి: CM KCR: ప్రభుత్వ కాంట్రాక్టులతోపాటు ప్రతీ వ్యాపారంలో ఎస్సీలకు రిజర్వేషన్‌: సీఎం

ABOUT THE AUTHOR

...view details