తెలంగాణ

telangana

'లోన్​యాప్స్​​' వేధింపులకు మరో ప్రాణం బలి.. సెల్ఫీ వీడియో తీసుకుని వివాహిత ఆత్మహత్య

By

Published : Jul 12, 2022, 12:07 PM IST

ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకానిలో దారుణం చోటుచేసుుకంది. రుణయాప్‌ నిర్వాహకుల వేధింపులతో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. రుణం చెల్లించకపోతే ఫొటో మార్ఫింగ్‌ చేసి కాంటాక్ట్‌ లిస్టులో ఉన్న వాళ్లకు న్యూడ్‌ ఫొటోలు పంపిస్తామని యాప్ నిర్వాహకులు బెదిరించారని సెల్పీ వీడియో రికార్డు చేసి తనువు చాలించింది.

సెల్ఫీ వీడియో తీసుకుని వివాహిత ఆత్మహత్య
సెల్ఫీ వీడియో తీసుకుని వివాహిత ఆత్మహత్య

సెల్ఫీ వీడియో తీసుకుని వివాహిత ఆత్మహత్య

రుణయాప్‌ నిర్వాహకుల వేధింపులతో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకానిలో ఈ విషాదం చోటుచేసుకుంది. చినకాకానికి చెందిన వివాహిత ప్రత్యూష.. రూపీ ఎక్స్‌ఎం యాప్‌లో రూ.20 వేలు రుణం తీసుకున్నారు. అందులో రూ.12 వేలు తిరిగి చెల్లించారు. మిగిలిన డబ్బులు సోమవారం ఉదయం లోపు చెల్లించాలని.. లేదంటే ఫొటో మార్ఫింగ్‌ చేసి కాంటాక్ట్‌ లిస్టులో ఉన్న వాళ్లకు న్యూడ్‌ ఫొటోలు పంపిస్తామని నిర్వాహకులు బెదిరించారు.

దీంతో బంధువుల వద్ద తన పరువు పోతుందని ప్రత్యూష భయపడింది. ఈ మేరకు సెల్ఫీ వీడియో తీసుకుని.. ఇంటిపై ఉన్న ఇనుప ఫ్లెక్సీ ఫ్రేమ్​కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి అమృతరావు ఫిర్యాదుతో మంగళగిరి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details