తెలంగాణ

telangana

లాక్‌డౌన్‌: వెలవెలబోతున్న భాగ్యనగర వీధులు

By

Published : Mar 24, 2020, 5:38 AM IST

Updated : Mar 24, 2020, 8:22 AM IST

భాగ్యనగరం రహదారులు, ప్రధానకూడళ్లు బోసిపోయాయి. ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటనతో నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే నగరంలోని పైవంతెనలను బారికేడ్లతో మూసివేసిన పోలీసులు ప్రధాన కూడళ్ల వద్ద వాహనదారులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

hyderabad roads empty with lockdown in telangana
లాక్‌డౌన్‌: వెలవెలబోతున్న భాగ్యనగర వీధులు

అర్ధరాత్రి వరకు జనాలతో కిటకిటలాడే జంటనగరాలు వెలవెలబోతున్నాయి. రాత్రి అయితే చాలు ట్యాంక్‌ బండ్‌, నెక్లెస్‌ రోడ్‌పై బర్త్‌డే పార్టీలతో హోరెత్తిపోయేది. కరోనా పుణ్యమా అని ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ట్యాంక్‌ బండ్‌, నెక్లెస్‌ రోడ్‌, అబిడ్స్‌, పంజాగుట్ట, బేగంపేట, ప్యారడైజ్‌, సికింద్రాబాద్‌ ప్రాంతాలు జనంలేక నిర్మానుష్యంగా మారాయి.

కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలని పిలుపు ఇచ్చినప్పటికీ బయటకు వచ్చినవారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. అనవసరంగా బయట తిరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రాత్రి సమయంలో బారికేడ్లతో రోడ్లు మూసివేశారు. వైరస్‌ ప్రభలకుండా జీహెచ్‌ఎంసీ సిబ్బంది ప్రధాన కూడళ్లు, రహదారులపై రసాయనాలు పిచికారి చేస్తున్నారు.

లాక్‌డౌన్‌: వెలవెలబోతున్న భాగ్యనగర వీధులు

ఇదీ చూడండి:'అధిక ధరలకు విక్రయిస్తే ఆ నంబర్​కు కాల్​ చేయండి'

Last Updated :Mar 24, 2020, 8:22 AM IST

ABOUT THE AUTHOR

...view details