తెలంగాణ

telangana

HIGH COURT: చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు వైకాపా రంగులపై హైకోర్టు ఆగ్రహం

By

Published : Sep 16, 2021, 3:38 PM IST

చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు వైకాపా రంగులపై ఏపీ ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వైకాపా రంగులను తొలగించాలంటూ కోర్టు ఆదేశించగా.. రెండు వారాల్లో రంగులు తొలగిస్తామని అధికారులు ధర్మాసనానికి తెలిపారు.

HIGH COURT: చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు వైకాపా రంగులపై హైకోర్టు ఆగ్రహం
HIGH COURT: చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు వైకాపా రంగులపై హైకోర్టు ఆగ్రహం

చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు వైకాపా రంగులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వైకాపా రంగులను తొలగించాలంటూ ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. రెండు వారాల్లో రంగులు తొలగిస్తామని అధికారులు ధర్మాసనానికి తెలిపారు. ప్రభుత్వ భవనాలకు వైకాపా రంగులు వేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కిందిస్థాయి అధికారులకు ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం చేసింది. అక్టోబర్ 6 లోపు రంగులు తొలగించి ప్రమాణపత్రం దాఖలు చేయాలని తెలిపింది.

కోట్ల రూపాయల ప్రజాధనంతో పార్టీ రంగులు వేశారని.. 'జై భీమ్ యాక్సిస్ జస్టిస్' కృష్ణా జిల్లా అధ్యక్షులు సురేష్ కుమార్ వ్యాజ్యం దాఖలు చేశారు. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి, స్వచ్ఛాంద్ర ఛైర్మన్‌ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు.

ఇదీ చదవండి: Bandi sanjay: 'తెరాస, భాజపా కలిసి ఉంటే మేమెందుకు పోటీచేస్తాం'

ABOUT THE AUTHOR

...view details