తెలంగాణ

telangana

హిందీ మహా విద్యాలయ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

By

Published : Jan 31, 2020, 12:30 PM IST

అంకుర సంస్థలు స్థాపించి.. పది మందికి ఉపాధి కల్పించినప్పుడే భారతదేశం ఒక ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. నల్లకుంటలోని హిందీ మహా విద్యాలయ గోల్డెన్ జూబ్లీ గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Graduation Day Celebrations In Hindi Mahavidyalaya
హిందీ మహావిద్యాలయా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

డిగ్రీ పట్టాలు పొందగానే ఉద్యోగాల కోసం కాకుండా... అంకుర సంస్థల స్థాపిన ఆలోచన, ఉత్సాహంతో ముందుకు సాగాలని విద్యార్థులకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించారు. అంకుర సంస్థలు స్థాపించి.. పది మందికి ఉపాధి కల్పించినప్పుడే భారతదేశం ఒక ఆర్థిక శక్తిగా ఎదుగుతుందన్నారు. హైదరాబాద్​ నల్లకుంటలోని హిందీ మహా విద్యాలయ గోల్డెన్ జూబ్లీ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

మోదీ ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో సైంటిఫిక్, టెంపర్, మోరల్ వాల్యూస్, మ్యాథమెటిక్స్​లో ప్రావీణ్యాన్ని సాధించడానికి ఆర్థిక సమ్మిళితమైన కోర్సులు ప్రవేశపెట్టడం సంతోషకరమన్నారు. భవిష్యత్తు ఉద్యోగావకాశాలు ఈ రంగాలవే అని పేర్కొన్నారు.

హిందీ మహావిద్యాలయ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

ఇవీ చూడండి:పోలీస్ కొలువు మాకొద్దు బాబోయ్..

ABOUT THE AUTHOR

...view details