తెలంగాణ

telangana

EAMCET Results 2022: నేడు ఎంసెట్, ఈసెట్ ఫలితాల విడుదల..

By

Published : Aug 11, 2022, 8:02 PM IST

Updated : Aug 12, 2022, 4:30 AM IST

EAMCET Results 2022: రాష్ట్రంలో ఎంసెట్, ఈసెట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటల 15 నిమిషాలకు ఎంసెట్, 11 గంటల 45 నిమిషాలకు ఈసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు.

EAMCET RESULTS 2022 RELEASING TOMORROW IN TELANGANA
EAMCET RESULTS 2022 RELEASING TOMORROW IN TELANGANA

EAMCET Results 2022: ఎంసెట్, ఈసెట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటల 15 నిమిషాలకు ఎంసెట్, 11 గంటల 45 నిమిషాలకు ఈసెట్ ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించారు. జేఎన్టీయూహెచ్​లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాలను www.eenadu.netలో చూడొచ్చు.

గత నెల 18 నుంచి 21 వరకు ఇంజినీరింగ్... 30, 31న అగ్రికల్చర్, ఫార్మా ఎంసెట్ నిర్వహించారు. ఇంజినీరింగ్​కు లక్షా 56 వేల 812 మంది.. అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల కోసం 80 వేల 575 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ప్రాథమిక సమాధానాలు విడుదల చేసి విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. తుది సమాధానాలతో పాటు ఫలితాలను ఎంసెట్‌ కమిటీ విశ్లేషించింది. దీంతో ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించారు. పాలిటెక్నిక్ డిప్లొమా అభ్యర్థులు బీటెక్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు ఈనెల 1న నిర్వహించిన ఈసెట్ కు 9 వేల 402మంది హాజరయ్యారు.

ఇవీ చూడండి:

Last Updated : Aug 12, 2022, 4:30 AM IST

ABOUT THE AUTHOR

...view details