తెలంగాణ

telangana

'అలెర్ట్​గా ఉండండి.. ముందస్తు చర్యలు చేపట్టండి'.. కలెక్టర్లకు సీఎస్​ ఆదేశాలు

By

Published : Jul 10, 2022, 3:02 PM IST

CS Somesh Kumar Review on Rains: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్​ సోమేశ్​కుమార్​.. దృశ్యమాద్యమ సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

CS Somesh Kumar Review on Rains in telangana
CS Somesh Kumar Review on Rains in telangana

CS Somesh Kumar Review on Rains: భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అన్ని జిల్లాల కలెక్టర్లతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నెలకొన్న పరిస్థితులను సీఎస్ సమీక్షించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎస్​ ఆదేశించారు.

రాష్ట్రంలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని.. ప్రాణ, పశువులు, ఆస్తినష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి నిఘా పెంచాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నీటిపారుదల, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇంధన శాఖలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.

ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని సీఎస్ పేర్కొన్నారు. ట్యాంకులు, చెరువులు, రిజర్వాయర్లు పొంగిపొర్లుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రమాదకర ట్యాంకులకు ఉల్లంఘనలు జరిగితే ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచేలా చూడాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను అవసరమైతే ప్రత్యేక శిబిరాలకు తరలించాలన్నారు. రోడ్లకు ఏమైనా నష్టం జరిగితే వెంటనే మరమ్మతులు చేయాలని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details